Omicron : జబల్ పుర్ లో అధికారులను కంగారు పెట్టిన బోట్స్ వానా మహిళ.. చివరికి..
ఈ నెల 18న ఢిల్లీ నుంచి జబల్ పూర్ లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్ మెంట్ కు వచ్చింది. కోవిడ్ ప్రొటోకాల్ లో భాగంగా విదేశీయుల పర్యటన వివరాలను రాష్ట్రాలతో పంచుకుంటున్న కేంద్రం.. ఆమె పర్యటన సమాచారాన్ని రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులకు చేరవేసింది. అయితే ఆమె ఎవరు? ఏ పనిమీద వచ్చింది? అన్న వివరాలు చెప్పలేదు.
జబల్ పుర్ : కరోనా Omicron variant వ్యాపించిన ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వచ్చేవారిపై గట్టి నిఘా, పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలో Boatswanaకు చెందిన మహిళ ఇటీవల మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ కు వచ్చిందన్న సమాచారం రావడంతో స్థానిక అధికారులకు ఓ రోజంతా కునుకు కరువయ్యింది. బోట్స్ వానా ఆర్మీలో కెప్టెన్ గా పనిచేస్తున్న 34 యేళ్ల ఒరీమెట్సో లిన్ ఖుమో ప్రస్తుతం అధికారిక పర్యటన మీద భారత్ లో ఉంది.
ఈ నెల 18న ఢిల్లీ నుంచి Jabalpurలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్ మెంట్ కు వచ్చింది. కోవిడ్ ప్రొటోకాల్ లో భాగంగా విదేశీయుల పర్యటన వివరాలను రాష్ట్రాలతో పంచుకుంటున్న కేంద్రం.. ఆమె పర్యటన సమాచారాన్ని రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులకు చేరవేసింది. అయితే ఆమె ఎవరు? ఏ పనిమీద వచ్చింది? అన్న వివరాలు చెప్పలేదు.
అప్పమత్తమైన జబల్ పుర్ అధికారులు ఆమె ఆచూకీ కోసం ఆదివారంవెతుకులాట ప్రారంభించారు. ఎట్టకేలకు సోమవారం స్థానిక Army Collegeలో ఆచూకీ గుర్తించారు. వెంటనే వెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిన ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం చూసి అంతా స్థిమితపడ్డారు.
ఇదిలా ఉండగా, ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకుంటున్న corona virus మరో కొత్త రూపం దాల్చి ప్రజల ముందుకు వచ్చింది. South Africaలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని Variant of Concern గా ప్రకటించింది.
ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు బెంబేలెత్తెతున్నారు. తాజాగా rome లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ omicron మొదటి ఫొటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్ లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటిరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన Variant ఒమిక్రాన్ అని వెల్లడించింది. ఒమిక్రాన్ ఉత్పరివర్తనలు మరింత ప్రమాదకరమైనవి రోమ్ పరిశోధకుల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయని పేర్కొంది.
అయితే, ఒమిక్రాన్ తో వ్యాప్తి ప్రభావం పెరుగుతోందా లేదా వ్యాక్లిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధనకులు పేర్కొన్నారు. కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్ లతో పోల్చితే ఒమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది.. ఇంకా స్పష్టంగా తెలియదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఒమిక్రాన్.. ఇతర కోవిడ్ వేరియంట్ ల కంటే భిన్న లక్షణాలు ఉన్నాయడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.