ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. వరుసగా రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.గత 24 గంటల్లో 41,804 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,880కి చేరుకొంది. నిన్న ఒక్క రోజే కరోనాతో 39, 130 మంది కోలుకొన్నారు.
దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,01,43,850కి చేరుకొంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4,32,041కి చేరుకొన్నాయి. కరోనాతో నిన్న ఒక్క రోజు 581 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,11,989కి చేరింది. బుధవారం నాడు ఒక్క రోజే 19,43,488 మంది శాంపిల్స్ సేకరించారు. దేశంలో ఇప్పటివరకు 43,80,11,958 మంది శాంపిల్స్ సేకరించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.నిన్న కరోనాతో 39 వేల మంది కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్న వారి కంటే కొత్తగా నమోదైన కేసులే ఎక్కువగా ఉన్నాయి. రికవరీల కంటే ఎక్కువగా కేసులు నమోదు కావడం ఆందోళనకల్గిస్తోంది.
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 39,13,40,491 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. నిన్న ఒక్క రోజే 34, 97,058 మంది వ్యాక్సినేషన్ వేయించుకొన్నారు.కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా అడుగులు వేసింది. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధిక కేసులు నమోదౌతున్నాయి.
