దేశంలో కొత్త‌గా 2,994 క‌రోనా కేసులు.. 2.09% పెరిగిన రోజువారి పాజిటివిటీ రేటు

New Delhi: భార‌త్ లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 2,994 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ రేటు 2.09 శాతానికి పెరిగింది. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ లలో ఇద్దరు చొప్పున, గుజరాత్ లో ఒకరు, కేరళలో ఇద్దరు క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయారు. 
 

India reports 2,994 new covid-19 cases; Daily positivity rate increased by 2.09% RMA

Covid-19: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలో గ‌త  24 గంట‌ల్లో కొత్త‌గా 2,994 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ రేటు 2.09 శాతానికి పెరిగింది. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ లలో ఇద్దరు చొప్పున, గుజరాత్ లో ఒకరు, కేరళలో ఇద్దరు క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయారు. కొత్త కేసులు క్ర‌మంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,354 కు పెరిగింది.

కాగా, దేశంలో క‌రోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి న‌మోదైన మొత్తం క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 4.47 కోట్లకు (4,47,18,781) చేరుకుంది. ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌ అప్డేట్ చేసిన డేటా ప్రకారం తొమ్మిది కోవిడ్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,876 కు పెరిగింది.

ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ లలో ఇద్దరు చొప్పున, గుజరాత్ లో ఒకరు, కేరళలో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. ప్ర‌స్తుతం దేశంలో 16,354 యాక్టివ్ కేసులు  ఉన్నాయి. ఇవి మొత్తం కోవిడ్ ఇన్ఫెక్షన్లలో 0.04 శాతం. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.77 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.09 శాతానికి పెర‌గ్గా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,71,551కి చేరింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా, కోవిడ్ -19 మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం తనను తాను బాగా చూసుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా సహాయం చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మహమ్మారితో పోరాడటంలో దేశం పోషించిన అద్భుతమైన పాత్ర అంతర్జాతీయంగా ప్రశంసించబడుతోందన్నారు. దాదాపు 180 కోట్ల రూపాయల విలువైన నాలుగు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన తరువాత మాండవీయ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

కోవిడ్ కేసుల పెరుగుద‌ల‌పై ఢిల్లీ ప్రభుత్వం నిఘా.. 

దేశ రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసులపై ఢిల్లీ ప్రభుత్వం నిఘా పెట్టిందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్ప‌టికే కేసులు పెరుగుద‌ల‌పై వ్యాఖ్యానించారు. గత నాలుగైదు రోజుల్లో కేవలం మూడు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ ముగ్గురు పేషెంట్లలో కో-మార్బిడిటీస్ చాలా తీవ్రంగా ఉన్నాయని, మరణాలు కో-మార్బిడిటీస్ వల్ల సంభవించాయని విష‌యాల‌ను సైతం ఆయ‌న ప్ర‌స్తావించారు. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కోవిడ్-19 పరిస్థితిని ఢిల్లీ ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios