న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరింత తగ్గాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా రెండు లక్షలకు దిగువనే కరోనా కేసులు నమోదౌతున్నాయి.  గడిచిన 24 గంటల్లో 1,14,460 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులతో పాటు కరోనాతో మరణించిన వారి సంఖ్య కూడ తగ్గింది. 

శనివారం నాడు కరోనాతో మూడువేలకు పైగా చనిపోయారు. ఆదివారం నాడు కరోనాతో మరణించినవారి సంఖ్య 2,677కి చేరుకొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,88,09.339కి చేరుకొంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య దేశంలో 3,46,759కి చేరింది. గత కొన్ని రోజులుగా కరోనా నుండి కోలుకొంటున్నవారి సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 1,89,232కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 2,69,84,781కి చేరింది. కరోనా రోగుల రివకరీ రేటు కూడ 93.67 శాతానికి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 14,77,799కి చేరింది.