దేశంలో కరోనా కేసులు (Corona Cases) స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసులు 6.8 శాతం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,008 కరోనా మరణాలు (Corona Deaths) చోటుచేసుకున్నాయి.
దేశంలో కరోనా కేసులు (Corona Cases) స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసులు 6.8 శాతం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,008 కరోనా మరణాలు (Corona Deaths) చోటుచేసుకున్నాయి. ఇందులో కేరళకు చెందిన 355 బ్యాక్ లాగ్ మరణాల గణంకాలు కూడా ఉన్నాయి. తాజా మరణాలతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,98,983కి చేరింది. తాజాగా దేశంలో కరోనా నుంచి 2,59,107 కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,97,70,414కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇక, దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 12.98 శాతంకు చేరింది. దేశంలో కరోనా రికవరీ రేటు 95.14 శాతం, మరణాల రేటు 1.19 శాతం, యాక్టివ్ కేసులు 3.67 శాతంగా ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 55,10,693 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,67,87,93,137కి చేరింది.
ఇక, దేశంలో బుధవారం (ఫిబ్రవరి 2) రోజున 15,69,449 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 73,41,92,614 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది.
