ఇండియాలో కరోనా కల్లోలం: ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కేసుల వ్యాప్తిని ఆపేందుకు ఆయా రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించినా కేసుల సంఖ్యలో పెరుగుదల తగ్గడం లేదు.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కేసుల వ్యాప్తిని ఆపేందుకు ఆయా రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించినా కేసుల సంఖ్యలో పెరుగుదల తగ్గడం లేదు.గత 24 గంటల వ్యవధిలో 2.95, 041 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో ఇప్పటివరకు 1,56,16,130కి చేరుకొన్నాయి. మరోవైపు కరోనాతో 2,023 మంది మరణించారు. ఇంత పెద్ద సంఖ్యలో మరణించిన వారి సంఖ్య ఇంత పెద్ద మొత్తంలో రికార్డు కాలేదు.ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 1,82,570 మంది మరణించారు. దేశంలో ఇంకా 2.1 మిలియన్ యాక్టివ్ కేసులున్నాయి.
గత 24 గంటల్లో 1,67,457 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 1,32,76,039 మంది కోలుకొన్నారు. రికవరీ రేటు 85.56 శాతంగా ఉంది.ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, లక్నో, భోపాల్, కోల్‌కత్తా, అలహాబాద్, సూరత్ పట్టణాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లోనే 57 శాతానికిపైగా కేసులు నమోదౌతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిల్లో నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదౌతున్నాయి. దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే బుధవారం నాడు ప్రకటన చేసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించే అవకాశం ఉంది.