దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,71,22,164కి చేరింది.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,71,22,164కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో మరో 314 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,86,066కి చేరింది. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,50,85721కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక, దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు.. 13.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.51 శాతం, యాక్టివ్ కేసులు.. 4.18 శాతంగా ఉంది. ఇక, శనివారం (జనవరి 15) రోజున దేశంలో 16,65,404 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,24,48,838కి చేరినట్టుగా తెలిపింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 66,21,395 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,56,76,15,454కి చేరింది.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
