INDIA NEW YEAR CELEBRATIONS: క‌రోన నిబంధ‌న‌ల మ‌ధ్య భార‌త్ లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రిగాయి.  కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆహ్లాదాన్ని కలిగించే రంగురంగుల దీపాలు, కళ్లు చెదిరే లేజర్​ షోల మధ్య నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు.  

 New Year Celebrations in India: దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా 2022 కొత్త సంవత్సరా నికి ఘనస్వాగతం పలికారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ .. రంగురంగుల దీపాలు, కళ్లు చెదిరే లేజర్​ షోల మధ్య నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు ఒక‌రినొక‌రు శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు. శుక్ర‌వారం అర్ధరాత్రి నుంచే కొత్త సంవత్సరం వేడుక‌లు జోరుగా సాగాయి. యువత కేకులు కట్‌చేస్తూ.. నృత్యాలు చేస్తూ ,, కేరింతలు కొడుతూ..నూత‌న సంవ‌త్సర వేడుక‌లు జరుపుకున్నారు. కొత్త సంవ‌త్స‌రంలో కోవిడ్ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాల‌ని, మ‌ళ్లీ పూర్వం రోజులు రావాల‌ని, ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో గ‌డ‌పాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటూ సంబ‌రాలు చేసుకున్నారు. 


దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్​ దీపాల వెలుగులు, కళ్లు చెదిరే లేజర్​ షోలు చూపరులను ఆకట్టుకునేలా ఉన్న‌యి. ఈ కాంతుల మ‌ధ్య న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రిగాయి. ఎన్నో స‌రికొత్త ఆశాల‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. భవనాలు, చారిత్రక కట్టడాలు విద్యుత్​ దీపాల కాంతులతో వెలిగిపోతున్నాయి.

గుజరాత్​లో నృత్యాలు చేస్తూ జవాన్లు వేడుకలు జరుపుకున్నారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల సంద‌ర్భంగా.. పార్లమెంటు భవ‌నాన్ని విద్యుత్ దీపాల అలంక‌రించారు. అలాగే ముంబయిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్ర‌త్యేక ఏర్పాటు చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన లేజ‌ర్ షో ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. విద్యుత్ వెలుగుల మ‌ధ్య ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మెరిసిపోతుంది. బంద్రా-వర్లీ సీలింక్ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంటోంది. గుజరాత్​ కచ్​లో బీఎస్​ఎఫ్ జవాన్లు నూతన సంవత్సర వేడకలు జరుపుకున్నారు. నృత్యాలు చేస్తూ ఒకరికొకరు న్యూ ఇయ‌ర్ విషెష్ చెప్పుకున్నారు. భార‌త సైనిక‌లు కూడా న్యూ ఇయ‌ర్ వేడుక‌లను జ‌రుపుకున్నారు.