భారత మార్కెట్ గురించి కేపిటల్ గ్రూప్ కథనం ప్రచురించింది.ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే ఇండియా గురించి ఈ కథనం పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది.
న్యూఢిల్లీ: అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కేపిటల్ గ్రూప్ తన కథనాలలో ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే భారత్ ను మరింత ఆకర్షణీయంగా అభివర్ణించింది. ఈ కథనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. యువత, పారిశ్రామికవేత్తలు తొమ్మిది పాయింట్లను ఆసక్తికరంగా చూస్తారని ప్రధాని అభిప్రాయపడ్డారు.
10 ఏళ్లలో భారతదేశం రాజకీయ సుస్థిరతను చూసింది. ఇది ఆర్ధికాభావృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారతదేశాన్ని ఆకర్షణీయంగా మార్చే కొన్ని కీలక అంశాలున్నాయి. 2014 లో ప్రధానిగా మోడీ చేపట్టినట్టి నుండి వ్యాపార అనుకూల సంస్కరణలకు ఆయన బృందం సహాయం చేసింది.ఆధార్ జాతీయ డేటా బేస్ లోకి ఒక బిలియన్ కంటే ఎక్కువ మందిని తీసుకు వచ్చారు.
2017లో తీసుకు వచ్చిన జీఎస్టీ పన్ను వ్యవస్థను సంస్కరించింది. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఈ సంస్కరణలు ఇండియాలో వృద్ధికి వేదికగా నిలిచాయన్నారు. 2027 నాటికి యూఎస్, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేశారు. జపాన్, జర్మనీ తర్వాత ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ
గత ఐదేళ్లలో రోడ్డు, రైలు, ఎయిర్ పోర్టులు, ఓడరేవుల నిర్మాణానికి మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయాలు ఖర్చు చేసింది. 10 ఏళ్ల క్రితం సూరత్ నుండి ముంబై ప్రయాణం చేయడానికి 12 గంటల సమయం పట్టిన విషయాన్ని ఆ కథనం గుర్తు చేసింది. అయితే ఇదే మార్గంలో ఏర్పాటు చేసిన ఆరు లైన్ల మార్గం కారణంగా ప్రయాణ సమయం చాలా తగ్గిందని పేర్కొంది. అంతేకాదు రోడ్డు పక్కనే నాణ్యమైన హోటల్స్ గురించి కూడ ఆ కథనం ప్రస్తావించింది. మరో వైపు ముంబైలో స్కై వేలు 15 ఏళ్ల క్రితం లేని విషయాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ముంబైకి 20 మైళ్ల దూరంలోని పలావా పట్టణం చైనాలో చూసే మాదిరి మాస్టర్ ప్లాన్డ్ కమ్యూనిటీ పట్టణంగా ఉందని పేర్కొంది.
మొబైల్ ఫోన్లు, గృహోపకరణలు, కంప్యూటర్లు, టెలి కమ్యూనికేషన్ పరికరాల తయారీ సామర్థ్యం విస్తరిస్తుంది. మరో వైపు జపాన్, తైవాన్, యూఎస్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు మోడీ సర్కార్ ఆకర్షిస్తుంది. ఆపిల్ కంపెనీ ఐ ఫోన్ ను ఇండియాలో ప్రారంభించింది. జపాన్ కు చెందిన మిత్సుబిసీ కంపెనీ తన ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషనర్లు, ఇతర బాగాలను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి.
భారత్ లో పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్నాయని ఆశిస్తున్నట్టుగా ఆ కథనం అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో ఐపీఓల విస్తరణ జరిగింది. దేశంలో పరిశ్రమలకు మూల ధనం వస్తోంది. ఈ ఏడాది మే 31 నాటికి ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్ మార్కెట్ కాపిటలైజేషన్ 1 ట్రిలియన్ గా అంచనా వేయబడింది.
2031 నాటికి భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో రియల్ ఏస్టేట్ 15 శాతం వాటాను కలిగి ఉంటుందని అంచనా వేశారు. ఇది ప్రస్తుతం 7 శాతం వద్ద ఉంది. దీనికితోడు నిర్మాణ సామాగ్రి, కేబుల్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. టెలికం ఇండస్ట్రీస్ మార్కెట్ బలంగా ఉంది. స్మార్ట్ ఫోన్ తో పాటు డేటా వినియోగం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని నిలుపుకుంటుందని భారత మార్కెట్ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.
