ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న (Russia-Ukraine tensions) నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో భార‌తీయ విద్యార్థులు వీలైనంత తొంద‌ర‌గా స్వ‌దేశానికి తిరిగి రావాల‌ని భార‌త ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల సంఖ్యను పెంచడానికి భారతదేశం ఆలోచనలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న (Russia-Ukraine tensions) నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో భార‌తీయ విద్యార్థులు వీలైనంత తొంద‌ర‌గా స్వ‌దేశానికి తిరిగి రావాల‌ని భార‌త ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల సంఖ్యను పెంచడానికి భారతదేశం ఆలోచనలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లోని ఉన్న భారతీయ విద్యార్థులు, భారత్‌లోని వారి తల్లిదండ్రులలు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల సంఖ్యను ఎలా పెంచాలనే దానిపై పౌర విమానయాన అధికారులు, వివిధ విమానయాన సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.

ఇక, ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకు ఇదివరకే సూచనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రష్యా, నాటో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత పౌరులు ఆ దేశాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నట్టుగా ఎంబసీ తెలిపింది.

ప్రస్తుతం తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో ఉన్న వారి పిల్లలతో మాట్లాడుతున్నారు.. అయితే వీలైనంత త్వరగా వారిని స్వదేశానికి తరలించాలని వారు కోరుతున్నారు. ఇక, ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరుల, భారతదేశంలోని వారి కుటుంబాల ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయబడుతున్నాయి అని ఆ వర్గాలు తెలిపాయి. ఇక, కేవలం భారతదేశం మాత్రమే కాకుండా.. అనేక ఇతర దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వీలైనంత త్వరగా తిరిగి రావాలని కోరాయి.