దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,435 కరోనా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,435 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం డేటాను విడుదల చేసింది. కిందటి రోజుతో(3,038 కేసులు) పోలిస్తే కరోనా కేసుల్లో 46 శాతం పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు (4,47,33,719) పెరిగింది.
గత 24 గంటల్లో 15 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 44,179,712గా ఉంది. ఇది మొత్తం కేసులలో 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.05 శాతంగా ఉంది.
దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.79 శాతంగా నమోదైంది. ఇక, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందించారు.
ఇక, మహారాష్ట్రలో మంగళవారం కోవిడ్ కేసులు 186 శాతం పెరిగాయి. గత 24 గంటల్లో 711 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,792కి చేరుకుంది.
