Asianet News TeluguAsianet News Telugu

Parliament: పార్లమెంటులో ప్రతిపక్షనేత ఖర్గే మైక్ ఆఫ్ చేశారు.. ‘ఇండియా’ పార్టీల వాకౌట్

పార్లమెంటులో మణిపూర్ పై ప్రధాని ప్రకటన చేయాలని, ఇతర డిమాండ్లను ప్రతిపక్ష పార్టీలు బలంగా లేవనెత్తుతున్నాయి. ఏకంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత మల్లికార్జన్ ఖర్గే మైక్ ఆఫ్ చేశారని ఇండియా కూటమి నేతలు చెప్పారు. దీంతో తాము పార్లమెంటు నుంచి వాకౌట్ చేశామని వివరించారు.
 

INDIA leaders walkout from parliament after mallikarjun kharge mic switched off kms
Author
First Published Jul 25, 2023, 4:12 PM IST

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చించాలని, ప్రధాని మోడీ పార్లమెంటులో మణిపూర్ పై మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్లతోనే పార్లమెంటు సమావేశాల్లో దాదాపు చర్చ జరగనేలేదు. తాజాగా, మరో వివాదం ముందుకు వచ్చింది. పార్లమెంటులో మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మైక్ ఆఫ్ చేసినట్టు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ తెలిపారు.

దీంతో తాము పార్లమెంటు నుంచి బయటకు వాకౌట్ చేయక తప్పలేదని ట్వీట్ చేశారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మైక్ ఆఫ్ చేయడంతో నిరసనగా తాము వాకౌట్ చేశామని వివరించారు.

 

 

Also Read: మీరు ఏ విధంగానైనా పిలవండి.. మేము మాత్రం.. : మోదీ వ్యాఖ్యలపై రాహుల్ రియాక్షన్

కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. మణిపూర్ పై ప్రధాని మోడీ పార్లమెంటులోపల స్టేట్‌మెంట్ ఇవ్వాలని, ఇతర తమ డిమాండ్లను ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో లేవనెత్తుతుండగా బీజేపీ ఎంపీలు ఆయనకు అడ్డుతగిలారని వివరించారు. ‘ఇండియా’ కూటమి డిమాండ్లను లేవనెత్తుతుండగా అడ్డుకున్నారని, ఏకంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకే తరుచూ అంతరాయాలు సృష్టించారని తెలిపారు. అంతేకాదు, బిల్లులను ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయడంతో ఈ రోజు మొత్తానికి ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్ చేశారని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios