ఇండియా కూటమిని వీడుతున్నా.. నా రాజీనామాకు కారణం అదే..- నితీష్ కుమార్
ఇండియా కూటమి (india alliance) నుంచి వైదొలుగుతున్నట్టు జేడీ(యూ) నేత (JDU Chief), బీహార్ అపద్ధర్మ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar)ప్రకటించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ (Bihar Governor Rajendra Vishwanath Arlekar)ను కోరినట్టు తెలిపారు.
జేడీ (యూ) చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజ్ భవన ఎదుట మీడియాతో మాట్లాడారు. సీఎం పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కూడా తాను గవర్నర్ కు సూచించానని అన్నారు. తాను ఇండియా కూటమిని వీడుతున్నానని స్పష్టం చేశారు. అంతా సవ్యంగా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని, అందుకే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. త్వరలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు
ఈ విషయంలో అందరి నుంచి అభిప్రాయాలు వస్తున్నాయని నితీష్ కుమార్ అన్నారు. అవన్నీ విన్నానని, ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం రద్దయిందని తెలిపారు. కాగా.. బీహార్ సీఎం ఆదివారం ఉదయం గవర్నర్ రాజేంద్ర వి ఆర్లేకర్ ను రాజ్ భవన్ లో కలిశారు. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని గవర్నర్ వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. ఆయన వెంట జేడీయూకు చెందిన సీనియర్ మంత్రి బిజేంద్ర యాదవ్ కూడా రాజ్ భవన్ కు వెళ్లారు.
నితీష్ కుమార్ తన అధికారిక నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో నేటి ఉదయం సమావేశం అయ్యారు. బీహార్ లోని మహాకూటమిని వీడి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆయన నిర్ణయానికి పార్టీ ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. అనంతరం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పించారు. సాయంత్రం 5 గంటల సమయంలో బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు..
ఇదిలా ఉండగా.. మహాకూటమిలో మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ బీహార్ లోని అన్ని ప్రముఖ దినపత్రికలకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఫొటోను ప్రొజెక్ట్ చేస్తూ.. ‘థ్యాంక్యూ తేజస్వీ’ అని ప్రకటన ఇచ్చింది. ఇందులో 4 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని పెంచడం, ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొంటూ డిప్యూటీ సీఎంకు ఆర్జేడీ కృతజ్ఞతలు తెలిపింది.
రామ్ లల్లా శిల కోసం నా భార్య తాళి తాకట్టు పెట్టా..- కాంట్రాక్టర్ శ్రీనివాస్
కాగా.. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ 78వ స్థానంలో ఉంది. జేడీయూకు 45, కాంగ్రెస్ కు 19, సీపీఐ (ఎం-ఎల్)కు 12, సీపీఎం, సీపీఐ లకు చెరో 2, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్)కు 4 స్థానాలు ఉన్నాయి. మరో రెండు స్థానాలు ఎంఐఎంకు ఉండగా.. ఒక స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి ఉంది.