డిజిటల్ పాలనలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశంలో సాగుతున్న పాలన గురించి గొప్పగా చెప్పారు. 

న్యూడిల్లీ : భారతదేశం డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల నుండి పరిపాలన వరకు అంతా డిజిటల్ పద్దతిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో భారతదేశంగా సాగుతున్న డిజిటల్ పాలనపై మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దేశంలోని కోట్లాదిమందికి డిజిటల్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అందించడం, ప్రభుత్వ పథకాల ద్వారా జరిగే లబ్దిని నేరుగా అర్హుల బ్యాంక్ అకౌంట్లకు చేర్చడమే భారత్ లో డిజిటల్ పాలనకు చక్కటి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఈ డిజిటల్ పాలనలో ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలిచిందని మాజీ కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు

యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ 'మారుతున్న ప్రపంచంలో బ్రిటన్ భవిష్యత్తు' అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత ప్రతినిధిగా రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పదేళ్ళలో భారత ప్రభుత్వం అద్భుతాలు చేసిందన్నారు. దీంతో 2014 తర్వాత దేశ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని... సమర్థవంతంగా ప్రజలకు పాలన అందించగల ప్రభుత్వంగా భారత్ కు మంచి గుర్తింపు వచ్చిందని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. 

1.2 బిలియన్లకు పైగా భారతీయులకు డిజిటల్ ఐడెంటిటీ అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది దేశ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని అన్నారు. 2014 కు ముందు చాలా ఆసియా దేశాలపై ఓ దురభిప్రాయం వుండేది... పాలన ప్రజల వరకు చేర్చలేరనే అభిప్రాయం ప్రపంచ దేశాలకు వుండేదన్నారు. కానీ 2014 తర్వాత భారత్ లో పాలనాపరమైన విప్లవం సాగింది... దీంతో దేశంపై పడిన మచ్చ తొలగిందని అన్నారు. శాస్త్ర సాంకేతికను ఉపయోగించిన పాలనను ప్రజలకు దగ్గరచేసిన ఘనత భారత్ కు దక్కుతుందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

YouTube video player

ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ పాలన సాగుతోందని...ఇది ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. చాలా దేశాలు భారత ప్రభుత్వం తమ ప్రజలకు అందించే డిజిటల్ పాలనా సేవలను ఫాలో అవుతున్నాయని తెలిపారు. 

YouTube video player

ఇలా భారతదేశంలో డిజిటల్ పాలన గురించి మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రసంగాన్ని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. భారత్ డిజిటల్ గవర్నెన్స్ స్థాపనలో ఆనాటి ఐటీ మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ పాత్ర చాలా వుందంటూ కొనియాడారు. భారత ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతమని టోని బ్లెయిర్ పేర్కొన్నారు.