Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయ హస్తం అందించిన భారత్.. 5 లక్షల టీకాల సరఫరా.. త్వరలో మరో 5 లక్షల వ్యాక్సిన్లు

తాలిబాన్లతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరోసారి సహాయ హస్తం అందించింది. ఐదు లక్షల కొవాగ్జిన్ టీకాలను ఈ దేశానికి పంపించింది. వచ్చే వారాల్లో మరో ఐదు లక్షల టీకాలను అందించడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. టీకాలతోపాటు ఆహార ధాన్యాలను పంపిస్తామని తెలిపింది. గత నెలలోనూ భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మెడికల అసిస్టెన్స్‌ను ఆ దేశానికి అందించింది.

india helped afghanistan.. send 5 lakh vaccine doses
Author
New Delhi, First Published Jan 1, 2022, 6:22 PM IST

న్యూఢిల్లీ: సుమారు రెండు దశాబ్దాల పాటు అంతర్గత పోరు జరిగి.. ఇప్పుడు తాలిబాన్(Taliban) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ(Economy) అధోపాతాళానికి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)కు భారత దేశం(India) సహాయం హస్తం అందించింది. పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ దేశానికి భారత్ ఎంతో సహాయం చేసింది. ప్రాజెక్టులు కట్టింది. పార్లమెంటు భవనాన్ని సైతం కట్టించింది. మరెన్నో విధాల ఆ దేశం అభివృద్ధి చెందడానికి సహకారం అందించింది. కానీ, తాలిబాన్లు అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఆ దేశ పరిస్థితులు పెనం మీది నుంచి పొయిలో పడ్డట్టుగా మారింది. విదేశీ సహాయం కోసం ఆ ఉగ్రవాదులు కోరుతున్నా.. వారి ఛాందస వాద తీరుతో చాలా దేశాలు సహకరించడానికి ముందుకు రావడం లేదు. ఆ దేశ ప్రభుత్వం కంటే.. అక్కడి ప్రజల సంక్షేమాన్ని ఆలోచించి భారత ప్రభుత్వం సహాయం అందించడానికి ముందడుగు వేసింది.

ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారత ప్రభుత్వం 5 లక్షల కొవాగ్జిన్ టీకాల(Vaccines)ను సరఫరా(Supply) చేసింది. కాబూల్‌లోని ఇందిరా గాంధీ హాస్పిటల్‌కు ఈ టీకాలు చేరినట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. వచ్చే వారాల్లో మరో ఐదు లక్షల టీకాలను సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నదని పేర్కొంది. ఆహార ధాన్యాలు, పది లక్షల టీకాలు, ప్రాణాధార ఔషధాలనూ అందించడానికి నిర్ణయించిందని వివరించింది.

Also Read: శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’

గతనెల 1.6 టన్నుల మెడికల్ అసిస్టెన్స్‌ను ఆ దేశానికి భారత్ అందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఈ సహాయం ఆఫ్ఘనిస్తాన్‌కు చేరింది. మిగిలిన మెడికల్ అసిస్టెన్స్‌తోపాటు గోధుమలను త్వరలోనూ ఈ దేశానికి పంపిస్తామని కేంద్రం తెలిపింది. దీని గురించి ఐక్యరాజ్య సమితితో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది. ఏ విధానంలో వీటిని ట్రాన్స్‌పోర్ట్ చేయాలనే విషయమై చర్చిస్తున్నట్టు పేర్కొంది. 

 ఈ ఏడాది ఆగస్టులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి Talibans వచ్చినప్పటి నుంచి ఆ దేశం సంక్షోభం అంచులకు చేరుతున్నది. ఆర్థిక పతనంతోపాటు అనేక సమస్యలు చుట్టుముట్టుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూలిపోయాక విదేశీ ఆర్థిక సహకారం సన్నగిల్లింది. దీనికతోడు తాలిబాన్ల ఛాందసత్వం కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది. మహిళల హక్కులను కాలరాస్తూ వారి స్వేచ్ఛను ఖైదు చేసింది. యుద్ధంతో అల్లకల్లోలాన్ని చవిచూసిన ఆఫ్ఘనిస్తాన్‌లో సహాయక చర్యల్లోనూ పనిచేయడానికి ఆ దేశ Womenను తాలిబాన్లు అనుమతించడం లేదు. దీంతో సంక్షోభంలో కూరుకుపోయి సహకారం కోసం దీనంగా ఎదురుచూస్తున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు, మహిళా నేతృత్వంలోని కుటుంబాలు మరింత విషాదంలోకి జారిపోతున్నాయి.

Also Read: Afghanistan: తొమ్మిదేళ్ల కూతురిని అమ్మేసిన తండ్రి.. ‘బతకాలంటే తప్పట్లేదు’

దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. రోజువారీ అవసరాలూ తీర్చుకోవడం కష్టసాధ్యమవుతున్నది. కనీసం ఇంకొన్ని సంవత్సరాలైనా బతికితే చాలు అనేంతటి దుస్థితికి ప్రజలు పడిపోయారు. ఈ పరిస్థితుల్లేనే కుటుంబాలు కౌమారదశలోని పిల్లలను సంపన్న వృద్ధులకు అమ్ముకుంటున్నారు. మిగతా కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి తన కూతురును అమ్ముతున్నట్టు అబ్దుల్ మాలిక్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios