Asianet News TeluguAsianet News Telugu

India Global Forum: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ని కలిసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బృందం

ఇండియా గ్లోబల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న యూకే ఇండియా వీక్ 2022 సమావేశాల సందర్భంగా బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. 

India Global Forum: Union minister rajeev chandrasekhar Led a delegation of New India Startups and met UK PM Boris Johnson
Author
New Delhi, First Published Jul 1, 2022, 7:14 PM IST

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రపెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో భేటీ అయ్యింది. యూకేలోని ఇండియా గ్లోబల్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా ఈ కలయిక జరిగింది. యూనికార్న్స్ అయిన Polygon, Koo, builder.ai , nyka, safexpay వంటి స్టార్టప్ లు ఈ ప్రతినిధుల బృందంలో వున్నాయి. న్యూఇండియా స్టార్ట్‌ప్ లు , ఇన్నోవేటర్ లను పరిచయడం చేయడంతోపాటు ఇన్నోవేషన్, టెక్నాలజీ సెక్టార్ లో భారతదేశ భవిష్యత్తుకు యూకే సహకారంపై చర్చించారు. 

కాగా.. యూకే ఇండియా సంబంధాలకు సంబంధించి భవిష్యత్తులో డిజిటల్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు రాజీవ్ చంద్రశేఖర్. 5జీ యుగంలో భారత్ ఇప్పుడు 5జీ కోసం మౌలిక సదుపాయాలను రూపొందిస్తోందని ఆయన అన్నారు. తాము ఒక దశాబ్ధంతో పోలిస్తే ఇప్పుడు చాలా ముందు వరుసలో వున్నామని The Forum: Reimagine@75 of UK-India Week సదస్సులో అన్నారు. ఇండియా, యూకేలు రెండూ ఇన్నోవేషన్ ఎకానమీని భవిష్యత్తులో విస్తరించాలని భావిస్తున్నాయని రాజీవ్ పేర్కొన్నారు. 

మొత్తం ఆర్ధిక వ్యవస్ధలో డిజిటల్ ఎకానమీని 25 శాతానికి తీసుకెళ్లాలనుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. విధాన రూపకర్తలుగా తాము వినియోగదారుల భద్రతను కూడా దృష్టిలో వుంచుకోవాల్సి వుంటుందన్నారు. దీనిని భారత్ అయినా యూకే అయినా ఒంటరిగా చేయలేదని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది ఒకే విధమైన విలువలతో కూడిన దేశాల కలయికగా వుండాలని.. డిజిటల్ ఎకానమీకి వ్యతిరేకంగా ఇంటర్నెట్ ను ఆయుధీకరించడం సాధ్యం కాదని నిర్ధారించుకోవడం సహా డేటాను స్థానికీకరించాలా వద్దా అనే చర్చకు దారి తీస్తుందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. 

భారతదేశ వృద్ధి అవకాశాల అంశంపై.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన కొన్ని దృఢమైన లక్ష్యాలతో 2025 నాటికి భారతదేశం ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్ధిక వ్యవస్థగా మారుతోందని రాజీవ్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios