Coronavirus: జోరందుకున్న వ్యాక్సినేష‌న్.. 12-14 ఏండ్ల 3 లక్షల మందికి టీకాలు !

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు 12-14 ఏండ్ల ఏజ్ గ్రూప్ వారికి కూడా టీకాలు ఇవ్వ‌డం ప్రారంభించింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కీల‌కంగా మారింది. 
 

India gears up against fourth wave of Covid-19, vaccinates over 3 lakh children aged 12-14 years on day 1

Coronavirus: దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మ‌ళ్లీ జోరందుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు 12-14 ఏండ్ల ఏజ్ గ్రూప్ వారికి కూడా టీకాలు ఇవ్వ‌డం ప్రారంభించింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కీల‌కంగా మారింది. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల 3 లక్షల మందికి పైగా పిల్లల‌కు కోవిడ్ -19 వ్యాక్సిన్ ను అందించినట్టు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం నాడు వెల్ల‌డించింది. దీంతో దేశంలో ప్ర‌జ‌ల‌కు అందించిన క‌రోనా డోసులు మొత్తం 180.80 కోట్లకు పైగా చేరుకున్నాయ‌ని తెలిపింది. 

12-14 ఏళ్ల మధ్య వయస్సు వారికి టీకాలు వేయడం బుధవారం ప్రారంభమైంది. ఈ వయస్సు వారికి హైద‌రాబ‌ద్ కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ త‌యారు చేసిన ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ Corbevax టీకాలు అందిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కోర్బెవాక్స్ ను రెండు డోసులుగా అందిస్తామ‌నీ, రెండు డోసులు 28 రోజుల వ్యవధిలో అందిస్తామ‌ని ప్ర‌భుత్వం త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. 14-15 ఏళ్ల మధ్య ఉన్న లబ్దిదారులు ఇప్పటికే 15-18 ఏళ్ల మధ్య వయస్కుల టీకా సమయంలో కవర్ చేసినట్లు కేంద్రం తెలిపింది. మార్చి 1, 2021 నాటికి దేశంలో 12-13 సంవత్సరాల వయస్సు గల 4.7 కోట్ల మంది పిల్లలు ఉన్నారు.

12-14 ఏండ్ల ఏజ్ గ్రూప్ వారికి క‌రోనా టీకాలు ఇవ్వ‌డంతో పాటు 60 ఏండ్లు పైబ‌డిన అందరికి ముంద‌స్తు కోవిడ్ డోసులు ఇవ్వ‌డం కూడా బుధ‌వారం నాడు ప్రారంభ‌మైంది. దాదాపు 2.15 కోట్లకు పైగా ముందు జాగ్రత్త మోతాదులను 60 ఏండ్లు పై బ‌డిన ఆరోగ్య‌ సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఇచ్చారు. కాగా, దేశంలోక‌రోనా పోరుకు లో భాగంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ 2021 జ‌నవ‌రి 16న ప్రారంభ‌మైంది. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు టీకాలు వేశారు. ఇక ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయడం గత సంవత్సరం ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమైంది. త‌దుప‌రి ద‌శ మార్చి 1న 60 ఏండ్లు పైబ‌డిన వారితో పాటు నిర్ధిష్ట అనారోగ్య సమ‌స్య‌లున్న 45 ఏండ్లు నిండిన వారికి కూడా కోవిడ్ టీకాలు ఇవ్వ‌డం ప్రారంభించారు. 

దేశంలో గత ఏడాది ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. అలాగే, 2021 మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ క‌రోనా టీకాలు వేయ‌డం ప్రారంభిస్తూ.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం విస్త‌రించింది.  ఇదిలావుండ‌గా, దేశంలో కొత్త‌గా 2,539 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 60 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,16,132 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్ర‌స్తుతం 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios