India's 1st Passenger Drone: మహారాష్ట్రలోని పూణేకు చెందిన‌ ఓ స్టార్టప్ దేశంలోనే తొలి ప్యాసింజర్ డ్రోన్ ను రూపొందించింది. భారత నౌకాదళం కోసం అభివృద్ధి చేసిన పైలట్‌లెస్ డ్రోన్ 130 కిలోల వరకు పేలోడ్‌ను మోయగలదు. ఆ బరువుతో 25 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించే సామ‌ర్థ్యం ఈ డ్రోన్‌కు ఉంది.

India's 1st Passenger Drone: మానవ రహిత డ్రోన్‌లు చాలానే ఉన్నాయి.. అయితే ఇప్పుడు.. మనుషులను మోసే డ్రోన్ కూడా వచ్చేసింది. అవునండీ.. ఇప్పుడు డ్రోన్ సహాయంతో.. మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సుల‌భంగా వెళ్ళవచ్చు. దేశంలోనే తొలి మానవ డ్రోన్‌ పరీక్షను ప్రధాని నరేంద్ర మోదీ ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే.. దీనిని మహారాష్ట్రలోని పూణేకు చెందిన‌ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ అనే స్టార్టప్ కంపెనీ ఈ డ్రోన్‌ను రూపొందించింది. ఈ డ్రోన్ నిర్మాణానికి దాదాపు నాలుగేళ్ల స‌మ‌యం పట్టింది. అనేక విఫ‌ల‌ ప్ర‌య‌త్నాల త‌రువాత.. ఈ డ్రోన్ సిద్ధమైంది. భారత సైన్యం కోసం ఈ డ్రోన్‌ను సిద్ధం చేశారు. ఈ డ్రోన్ 130 కిలోల బరువుతో ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ డ్రోన్ గురించి కంపెనీ సహ వ్యవస్థాపకుడు రితుల్ బబ్బర్ మాట్లాడుతూ.. డ్రోన్‌ను "రిమోట్" ప్రాంతాలలో ఎయిర్ అంబులెన్స్ లేదా వస్తువుల రవాణా కోసం ఉపయోగ‌కారిగా తోడ్ప‌డుతుంద‌నీ, ఈ డ్రోన్ దాదాపు 130 కిలోల బరువును సులభంగా తీసుకెళ్లే సామర్థ్యం ఉంద‌నీ, అలాగే.. 30 నుండి 35 కి.మీ వరకు ప్రయాణించగలదని తెలిపారు. అంతేకాకుండా.. ఈ డ్రోన్లో సాంకేతిక లోపాలు త‌ల్లెత్తిన సురక్షితంగా సేఫ్ ల్యాండింగ్ అవుతుంద‌నీ, డ్రోన్‌లో పారాచూట్‌ను అమర్చిన‌ట్టు తెలిపారు.

ఈ పారాచూట్ అత్యవసర పరిస్థితుల్లో తెరుచుకుంటుందనీ, త‌ద్వారా డ్రోన్ సురక్షితంగా నేలపైకి వస్తుందని వివ‌రించారు. ఈ డ్రోన్ పూర్తిగా సురక్షితమైనదనీ, ఎగురుతున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో ఈ డ్రోన్ భారత సైన్యంలో చేర‌నున్న‌ద‌ని తెలిపారు. డ్రోన్ అనేది ఎలక్ట్రానిక్ గాడ్జెట్. ఇది రిమోట్ సహాయంతో ఎగురుతుంది. ఇప్పటి వరకు చిన్న తరహా డ్రోన్లను తయారు చేసేవారు. అయితే ఇప్పుడు పెద్ద డ్రోన్లు కూడా తయారవుతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన రెండు రోజుల భారత్ డ్రోన్ మహోత్సవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ డ్రోన్ (వరుణ) సామర్థాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో పిఎం మోడీ మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాలి, ప్రతి పొలంలో డ్రోన్ ఉండాలి, అప్ప‌డే..ప్రతి ఇంటికి శ్రేయస్సు అని, అది తన కల అని మోడీ పేర్కొన్నారు. అలాగే.. ఈ డ్రోన్ కు సంబంధించిన వీడియోల‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

Scroll to load tweet…