న్యూఢిల్లీ: ఐరోపా దేశాలతో వ్యాపార, రక్షణ సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 

15వ, ఇండియా- యూరోపియన్ యూనియన్ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో నెలకొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్య దేశాల మధ్య తమకు బలమైన సహకారం అవసరమని మోడీ చెప్పారు.

ప్రస్తుత సవాళ్లతో పాటు వాతావరణ మార్పుల వంటి దీర్ఘకాలిక సవాళ్లపై భారత్, ఈయూలు ప్రాధాన్యతను ఇస్తాయని మోడీ తెలిపారు. దేశంలో పునరుత్సాదక ఇందన వినియోగాన్ని పెంచే ప్రయత్నాల్లో  యూరప్ నుండి పెట్టుబడులు సాంకేతికతలను ఆహ్వానిస్తున్నామని మోడీ ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో ప్రపంచంలో కొత్త ప్రపంచీకరణపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తాము 150 దేశాలకు మందులను పంపించినట్టుగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండియా, యూరోపియన్ యూనియన్లు సహాజ భాగస్వామ్యులని మోడీ స్పష్టం చేశారు. 

ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సహకారం ఎంతో అవసరమని ఈయు అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.