Asianet News TeluguAsianet News Telugu

Rahul Gandhi: నేనూ హిందువునే.. కానీ, హిందుత్వ వాదిని కాదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: దేశ‌రాజకీయాల్లో హిందూ- హిందుత్వవాది అనే రెండు పదాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని, ఆ ప‌దాల‌ అర్థాల్లో చాలా వ్య‌త్య‌సం ఉంద‌ని  కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. భారతదేశం హిందువుల దేశమే.. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో ఉండాలనుకునే హిందుత్వవాదులది మాత్రం కాదని రాహుల్ అన్నారు.
 

India country of Hindus, not Hindutvavadis: Rahul Gandhi in Rajasthan
Author
Hyderabad, First Published Dec 12, 2021, 4:49 PM IST

Rahul Gandhi:  మరోసారి హిందు, హిందుత్వవాది అనే రెండు పదాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి.   దేశ రాజ‌కీయాల్లో హిందూ, ‘హిందుత్వవాది’ రెండు వేర్వేరు పదాలని, ఈ రెండు ప‌దాల మధ్య తీవ్ర పోటీ ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహ‌ల్ గాంధీ అన్నారు. ఆదివారం జైపూర్ లో జరిగిన బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ మాట్లాడుతూ.. మోడీ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

భారతదేశం హిందువుల దేశమే.. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో ఉండాలనుకునే హిందుత్వవాదులది మాత్రం కాదని రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. హిందువు,  హిందువాది  మధ్య చాలా వ్యత్యాసం ఉంద‌నీ, హిందువు అంటే.. సత్యం కోసం శోధించేవాడ‌నీ, దానినే సత్యాగ్రహం అంటారని , హిందువంటే అందరినీ కలుపుకుని పోయేవాడని, ఎవరికీ భయపడడని, అన్ని మతాలనూ గౌరవించేవాడని చెప్పారు. కానీ హిందుత్వవాదులు సత్యాగ్రహం పాటించరని, అధికారం కోసం పాకులాడతారని, అధికారం కోసం ఎంత‌టి దారుణాల‌కైనా పాల్ప‌డుతార‌ని ఎద్దేవా చేశారు. 

Read Also: https://telugu.asianetnews.com/national/cow-swallows-gold-chain-weighing-20-grams-owned-done-surgery-r3zpg8

మహాత్మాగాంధీ హిందూ అని, గాడ్సే హిందుత్వవాదని చెప్పారు. హిందుత్వవాదులు జీవితామంతా  హిందుత్వవాదులు 2014 నుంచి అధికారంలో ఉన్నారని, వారిని సాధ్య‌మ‌నంత త్వ‌ర‌గా గ‌ద్దే దించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌ధాని మోడీ, త‌న స్నేహితులు దేశాన్ని నాశనం చేశారని, ఆయ‌న  పారిశ్రామికవేత్త స్నేహితులు ఏడేళ్లలో దేశాన్ని దోచుకుంటున్నార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం ఏర్ప‌డి నిత్యం ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతుంటే.. ఆ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోకుండా.. హిందుత్వ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు.  మ‌న దేశంలో ఆర్థిక అస‌మాన‌త‌లున్నాయ‌నీ, ఒక శాతం జ‌నాభా చేతిలో 33 శాతం సంపద ఉందనీ,  దేశ జ‌నాభాలో స‌గానికి పైగా మంది పేద‌రికంలో ఉన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read Also: https://telugu.asianetnews.com/telangana/hyderabad-charminar-mla-mumtaz-ahmed-khan-attack-on-youth-r3zzzc

అనంత‌రం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. 70 ఏళ్లలో పాల‌న కాంగ్రెస్ ఏం చేసిందని అడిగే వారు, మొద‌ట త‌మ‌ని తాము ప్ర‌శ్నించుకోవాల‌ని,  గత ఏడేళ్లలో మోడీ స‌ర్కార్ ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ ప్రభుత్వం పౌరులకు ఏమి చేసిందని ప్రశ్నించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress) సృష్టించిన వాటిని బీజేపీ ప్రభుత్వం అమ్ముకుంటూ వ‌స్తోంద‌ని, మోడీ స‌ర్కార్ ప్ర‌జ‌ల కోసం కాకుండా..  పారిశ్రామికవేత్తల కోసమే పని చేస్తోందని విమ‌ర్శించారు.

Read Also: https://telugu.asianetnews.com/national/cds-general-bipin-rawat-last-speech-pre-recorded-message-r3zuod

కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయాలని ప్రజలను కోరిన ప్రియాంక‌, ద్రవ్యోల్బణంపై పోరులో కాంగ్రెస్ పార్టీ తమకు తోడుగా నిలుస్తుందని అన్నారు. పేద‌ల‌కు త‌మ బ‌తుకును భారం చేసున్నార‌నీ, నేడు ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,000 ఉంటే.. నూనె రూ. 200, ఇక  పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పింది. ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డంపైనే మోదీ శ్ర‌ద్ధ పెట్టారు త‌ప్పించి, ప్ర‌జ‌ల ఇబ్బందుల‌పై దృష్టి పెట్ట‌లేద‌ని మండిప‌డ్డారు. దేశాన్ని ఐదారుగురు కార్పొరేట్ శక్తులు న‌డిపిస్తున్నాయ‌ని, వారి ప‌నిలో మోదీ నిమ‌గ్నుల‌య్యార‌ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు.

జైపూర్‌లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో జరిగిన సభలో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఆదిర్ రంజన్ చౌదరి, భూపేష్ బఘేల్, మల్లికార్జున్ ఖర్గే, కుమారి సెల్జా,   పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ సభకు హాజరయ్యారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios