Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎన్ని పెరిగాయంటే..

గత 24 గంటల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 5,611 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 140 మంది కరోనా కారణంగా మరణించారు. 

India coronavirus, COVID-19 live updates, May 20: India's total COVID-19 cases rose to 1,06,750 with death toll at 3,303
Author
Hyderabad, First Published May 20, 2020, 9:57 AM IST

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసులు భారీగా పెరగడం గమనార్హం. దాదాపుగా ప్రతీ రోజు కూడా 4 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న కూడా 5వేల కేసులు నమోదు కావడం గమనార్హం.

గత 24 గంటల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 5,611 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 140 మంది కరోనా కారణంగా మరణించారు. కాగా.. దేశంలో కరోనా కేసులు లక్ష దాటేశాయి.మొత్తంగా 1,06,750 కేసులు నమోదు కాగా 3,303 మంది మరణించారు.

 కాగా.. ఇప్పటి వరకు దేశంలో 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు చెప్పారు.

అయితే దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఇప్పటివరకు 92మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

ఎయిమ్స్ ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన అధ్యాపకునికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో దాదాపు పదిమంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు.

 మొత్తం 92మందిలో ఒకరు అధ్యాపకులు, ఇద్దరు రెసిడెంట్‌ వైద్యులు, 13మంది నర్సింగ్‌ సిబ్బంది, 45మంది సెక్యూరిటీ గార్డులతో పాటు మరో 12మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలాఉండగా దిల్లీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలు దాటగా 160మంది మరణించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 35,058 కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios