ఈశాన్య రాష్ట్రంలో తొలి కరోనా మరణం
తాజాగా ఒడిశాలో మరో 19 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కాగా.. ఇప్పటి వరకు భారత్ లో 5,865మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. వారిలో 5,218మందికి ఇప్పటికీ కరోనా ఉండగా... 477మంది కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఇప్పటి వరకు 169మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు
ఈశాన్య రాష్ట్రాల్లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైరస్ సోకి అస్సాంలో 65 ఏళ్ల వ్యక్తి కన్నుమూశారు.అయనను హైలాకాండి జిల్లాకు ఫైజుల్ హక్ బార్బ్యాన్ (65)గా గుర్తించారు. ఎస్‌ఎంసీహెచ్ ఆస్పత్రిలో మరణించినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.
Also Read కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ముగ్గురి మృతి...
మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మరోవైపు అసోంలో ఇప్పటివరకు 28 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారే ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఒడిశాలో మరో 19 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కాగా.. ఇప్పటి వరకు భారత్ లో 5,865మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. వారిలో 5,218మందికి ఇప్పటికీ కరోనా ఉండగా... 477మంది కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఇప్పటి వరకు 169మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కాగా.. కేవలం గురువారం మహరాష్ట్రలో 163కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. కాగా.. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1300 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 381 కంటోన్మెంట్ ఏరియాలను ప్రకటించారు.