ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ కలకలం రేపింది. కర్ణాట రాష్ట్రంలోని శివమొగ్గా జిల్లాలో మంకీ ఫీవర్లు విజృంభిస్తుండటం ఇప్పడు సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.

Also Read అప్పు తీర్చలేక.. భార్య మానాన్ని స్నేహితుడికి అమ్మకానికి పెట్టి.....

శివమొగ్గా జిల్లాలో 139 మందికి మంకీ జ్వరాలు రాగా, వీరిలో ముగ్గురు మరణించారని ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబీ శివకుమార్ చెప్పారు. మంకీ జ్వరాలు వచ్చిన వారిలో 130 మందికి చికిత్స చేయడంతో వారు కోలుకున్నారని శివకుమార్ పేర్కొన్నారు. 

మంకీ జ్వరం వల్ల ఒక రోగి మరణించాడని తేలిందని, మరో ఇద్దరు రోగులు కూడా మరణించారని, వారి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని కమిషనర్ చెప్పారు. గత ఏడాది శివమొగ్గా జిల్లాలో ప్రబలిన మంకీ జ్వరాలు 400 మందికి రాగా, ఇందులో 23 మంది మరణించారు. శివమొగ్గా అడవుల్లోని కోతుల ద్వార వస్తున్న ఈ మంకీ జ్వరాలు ఈ ఏడాది కూడా ప్రబలడంతో ప్రజలు కలవరపడుతున్నారు.