ఇండియా-చైనా సరిహద్దుల్లో నెలకొన్న సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది భారత్. ఈ నెల 19వ తేదీన ఈ విషయమై అన్ని పార్టీలతో చర్చించనుంది ప్రభుత్వం.

చైనాకు చెందిన సుమారు 40 మంది సైనికులు మరణించినట్టుగా సమాచారం. ఈ పరిణామాలపై త్రివిధ దళాల అధికారులతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్  సింగ్ ఈ నెల 16వ తేదీన సమావేశయ్యారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి కూడ పాల్గొన్నారు.

 

సరిహద్దులో చోటు చేసుకొన్న పరిణామాలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడే ప్రధాని మోడీకి వివరించారు.ఈ పరిణామాలపై చర్చించేందుకు గాను ఈ నెల 19వ తేదీ సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ. కరోనా నేపథ్యంలో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.

also read:రేపు సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

చైనా దాడిలో ఇండియాకు చెందిన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోవడంపై  రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనను బాధాకరమైందిగా చెప్పారు. విధి నిర్వహణలో ధైర్యం, శౌర్యాన్ని ఇండియా సైనికులు ప్రదర్శించారని ఆయన చెప్పారు.సైనికుల త్యాగాన్ని ఎవరూ కూడ మరిచిపోరన్నారు.