సారాంశం
చెట్టుకు గుద్దుకోవడంతో కారులో మంటలు చెలరేగి కొత్తగా పెళ్లైన జంటతో సహా నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లో బుధవారం కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుద్దుకుని ధ్వంసమైన కారు.. మంటల్లో దగ్ధమవ్వడం వీడియోలు కనిపిస్తోంది. ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
"హర్దా జిల్లాలో అతివేంగంలో వస్తున్న కారుజజ చెట్టుకు గుద్దుకోవడంతో ముగ్గురు పురుషులు, ఒక మహిళ సజీవ దహనమయ్యారు. వారు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు" అని పోలీసు అధికారి తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, ఆరు నెలల క్రితం వివాహమైన దంపతులు ఉన్నారని ఆయన తెలిపారు. దీనిమీద తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
పడుకోవడం విషయంలో గొడవ.. కూతురిని 25సార్లు దారుణంగా కత్తితో పొడిచి చంపిన తండ్రి.. !
గత వారం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో స్లీపర్ బస్సు ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. అహ్మదాబాద్‌కు ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది.