Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నైలో ఇద్దరు మృతి.. పలు ప్రాంతాల్లో మూడు దశాబ్దాల రికార్డు బ్రేక్..

తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వాన వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. 

In Tamil Nadu Heavy rains .. Two dead in Chennai .. Record breaking of three decades in many areas ..
Author
First Published Nov 2, 2022, 6:20 AM IST

తమిళనాడులో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. చెన్నై, దాని శివారు ప్రాంతాలలో మంగళవారం రాత్రిపూట ప్రారంభమైన రికార్డు వర్షం నగరం, శివార్లలోని అనేక ప్రాంతాలలో వరదలకు దారితీసింది. వర్షం వల్ల సంభవించిన ఘటన వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కోర్ సిటీ ఏరియా అయిన నుంగంబాక్కంలో ఒకే రోజు 8 సెంటీమీటర్లు, సబర్బన్ రెడ్ హిల్స్ 13 సెంటీమీటర్లు, పెరంబూర్‌లో 12 సెంటీ మీటర్లు వర్షపాత నమోదు అయ్యిందని ‘ఎన్డీటీవీ’నివేదించింది. 

ప్రధాని మోడీ పర్యటన వల్లే గుజరాత్ లో ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం - కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

తమిళనాడులో అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావేరి డెల్టా ప్రాంతాలు, కన్యాకుమారి వంటి తీర ప్రాంతాల్లో 1 నుంచి 9 సెంటీ మీటర్ల మేర వర్షాలు కురిశాయి. వర్షాల వల్ల రెండు సబ్‌వేలు మూసివేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. కాగా.. మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

నుంగంబాక్కంలో మంగళవారం 8 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. 30 సంవత్సరాలలో ఇంత స్థాయిలో భారీ వర్షం కురవడం ఇదే మొదటి సారి. గత 72 సంవత్సరాలలో ఇది మూడోది అని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ప్రాంతీయ వాతావరణ కేంద్రం, ఎస్. బాలచంద్రన్ తెలిపారు. 1964లో 11 సెంటీమీటర్లు, 1990లో 13 సెంటీ మీటర్ల వర్షం నమోదు అయ్యింది.

పరస్పర ఇష్టంతో సెక్స్ లో పాల్గొంటే పోక్సో చట్టం ప్రకారం ‘లైంగిక వేధింపులు’ అనలేము - మేఘాలయ హైకోర్టు

ఆర్టీరియల్ అన్నా సాలై, రద్దీగా ఉండే ఉత్తర చెన్నైలోని రద్దీ ప్రాంతాలు, నగరం దక్షిణ, ఉత్తర, శివారు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వర్షం వల్ల విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మరణించారు. సిటీ ఉత్తర ప్రాంతంలోని పులియంతోప్‌లో ఓ భవనం కూలిపోవడంతో ఓ మహిళ చనిపోయింది. శివారులో విద్యుదాఘాతానికి గురై ఓ ఆవు మృతి చెందింది. ఉత్తర చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.

ఈ భారీ వర్షాలకు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేటతో పాటు 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ఈశాన్య గాలులు ఉత్తర తమిళనాడు దానిని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల వెంబడి, వెలుపల కొనసాగుతూనే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. చెన్నై కార్పొరేషన్ పరిధిలో 75 శాతం స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులు పూర్తయ్యాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కెఎన్ నెహ్రూ తెలిపారు. మిడ్‌టౌన్ జీఎన్ చెట్టి రోడ్డు వంటి గతంలో ముంపునకు గురయ్యే అనేక ప్రాంతాలు డ్రెయిన్ అభివృద్ధి పనుల దృష్ట్యా వరదకు గురి కాలేదని చెప్పారు.

తక్కువ లోతులో నీరు, నది అడుగులో రాళ్లే ప్రాణ నష్టానికి కారణం.. గుజరాత్ బ్రిడ్జి విషాదంపై ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్

ఈ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు అనేక ప్రాంతాలను పరిశీలించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అధికారులు వరద పర్యవేక్షణ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న తుఫాను నీటి కాలువల అభివృద్ధి పనులు, చెన్నై మెట్రోరైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ దృష్ట్యా, అనేక రహదారులలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. రానున్న 3 రోజుల పాటు తమిళనాడు పుదుచ్చేరి-కరైకల్‌లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేట్, వెల్లూరుతో సహా ఉత్తరాది జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉంది. కావేరి డెల్టా జోన్‌, రామనాథపురం, శివగంగ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios