Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీ పర్యటన వల్లే గుజరాత్ లో ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం - కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

గుజరాత్ లో ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం కావడానికి ప్రధాని నరేంద్ర మోడీయే కారణం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆయన పర్యటన వల్లే ఇంకా షెడ్యూల్ విడుదల కావడం లేదని ఆరోపించారు. 

Election schedule in Gujarat delayed due to Prime Minister Modi's visit - Congress president Mallikarjun Kharge
Author
First Published Nov 2, 2022, 5:33 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో పర్యటిస్తున్నందుకే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఆలస్యమవుతోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘పీఎం మోడీ గత ఆరు రోజులుగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.  కానీ మోర్బిలో కూలిపోయిన వంతెనల మాదిరిగా ప్రధాని మోడీ అక్కడ మరెన్నో వంతెనలను ప్రారంభించాల్సి ఉంది. అందుకే ఇంకా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు.’’అని ఆయన అన్నారు.

పరస్పర ఇష్టంతో సెక్స్ లో పాల్గొంటే పోక్సో చట్టం ప్రకారం ‘లైంగిక వేధింపులు’ అనలేము - మేఘాలయ హైకోర్టు

గుజరాత్‌లోని మోర్బీలో ఉన్న కేబుల్ వంతెన కూలి 140 మందికి పైగా మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్న రెండు రోజుల తరువాత మల్లికార్జున్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఈరోజు ఘటనాస్థలిని సందర్శించారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కాగా.. మోర్బీ దుర్ఘటనలో మరణించిన వ్యక్తులకు నివాళి అర్పించేందుకు నవంబర్ 2న గుజరాత్‌లో రాష్ట్రవ్యాప్త సంతాప దినంగా పాటించనున్నారు.

ఛత్ ఉత్సవాల్లో నీటిలో మునిగి 53 మంది మృతి.. బీహర్ లో ఘటన

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గాంధీనగర్‌ రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు (బుధవారం) ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం వరకు ఎగురవేయనున్నారు. ప్రభుత్వం తరుఫున నిర్వహించే బహిరంగ కార్యక్రమాలు, రిసెప్షన్లు, వినోద కార్యక్రమాలన్నీ రద్దు అవుతాయి.

ఇదిలా ఉండగా.. భారత ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది. అయితే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. 

జమ్మూ కాశ్మీర్ లో జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం..

ఈ రాష్ట్రంలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే బీజేపీ కూడా మరో సారి అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రంలో దాదాపు చాలా ఏళ్లుగా పాతుకుపోయి ఉంది. గుజరాత్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా 2001 నుండి 2014 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధాని అయ్యారు. కాగా.. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017లో ఇక్కడ బీజేపీ 99 సీట్లు గెలుచుకొని అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్షంలో కూర్చుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాగే బీటీపీ రెండు స్థానాలు, ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios