Asianet News TeluguAsianet News Telugu

దారుణం : యువతితో స్నేహం... యువకులపై దాడి, అరగుండు, మెడలో చెప్పులదండలు.. !!

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తన కూతురుతో స్నేహం చేస్తున్నారని ఓ 20 యేళ్ల యువకుడిని, అతని స్నేహితుడిని యువతి తండ్రి దారుణంగా కొట్టి, అరగుండు గీయించి, చెప్పుల దండలు వేసి అవమానించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో జరిగింది. 

In Madhya Pradesh, 2 Men Assaulted Over Friendship With Woman - bsb
Author
Hyderabad, First Published Jun 1, 2021, 12:31 PM IST

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తన కూతురుతో స్నేహం చేస్తున్నారని ఓ 20 యేళ్ల యువకుడిని, అతని స్నేహితుడిని యువతి తండ్రి దారుణంగా కొట్టి, అరగుండు గీయించి, చెప్పుల దండలు వేసి అవమానించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో జరిగింది. 

ఈ దారుణమైన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో యువతి తండ్రి, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మే 22న జరిగిన ఈ ఘటన మీద ఓ దళిత యువకుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  భారతీయ శిక్షాస్మృతిలోని  ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. 

 ఫిర్యాదు దారుడు రాజ్ కుమార్ డెహారియా చెప్పిన వివరాల ప్రకారం.. అతను గ్రామంలోని ఓబిసీ సామాజిక వర్గానికి చెందిన పలుకుబడి గల కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతితో స్నేహం చేస్తున్నాడు. అయితే ఆ యువతి తనను ఇంట్లో బంధించారని, బైటికి వెళ్లనివ్వడం లేదని, కమ్యూనికేట్ చేయడానికి ఫోన్ కూడా లేదని తెలపడంతో.. అతను తన స్నేహితుడి ఫోన్ ను కొద్దిరోజుల కోసం అప్పుగా తీసుకుని ఆమెకు ఇచ్చాడు. 

విషాదం:'సైకిల్ గర్ల్‌' జ్యోతి తండ్రి అనారోగ్యంతో మృతి...

ఫోన్ విషయం యువతి తండ్రికి తెలియడంతో.. యువతి బంధువులు రాజ్ కుమార్ డెహారియా, అతని స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ తరువాత తన కూతురితో చనువుగా ఉంటావా అంటూ దాడి చేసి, అరగుండు గీయించారు. అంతటితో ఆగకుండా మెడలో బూట్ల దండలు వేశారు. 

ఈ విషయం పోలీసులకు చెబితే తమ కుటుంబాలకు హాని చేస్తామని నిందితులు బెదిరించారని ఇద్దరు యువకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఈ మేరకు కేసు నమోదైంది. యాదవ వర్గానికి చెందిన అమ్మాయికి దళిత వర్గానికి చెందిన రాజ్‌కుమార్ డెహారియా మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఈ విషయం కుటుంబంలో తెలియడంతో గొడవ మొదలయ్ియంది. వారు ఆ యువకుడిని కొట్టారు. మే 27 న మాకు సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకున్నాం. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు సమర్పించాం. కోర్టు వారిని రిమాండ్‌కు తరలించింది ”అని సీనియర్ పోలీసు అధికారి రవి చౌహాన్ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios