బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చు రేగింది.  కుమారస్వామి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ను మాజీ సీఎం సిద్దరామయ్యను వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది.  సిద్దరామయ్య తీరు జెడీఎస్‌తో పాటు కాంగ్రెస్ నేతలకు కూడ మింగుడుపడడం లేదు.

కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా సిద్ధరామయ్య జైడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తారని అంతా ఆశించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆయనే ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పెద్ద సమస్యగా మారారని అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి కుమార స్వామి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాను ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన  ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అవసరం లేదనేది సిద్దరామయ్య వాదిస్తున్నారు. 

తాజాగా బయటికి వస్తున్న వీడియోలన్నీ సిద్ధరామయ్య చికిత్స పొందుతున్న దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తాంగడి ప్రకృతి వైద్య కేంద్రం నుంచే వస్తున్నాయని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లోని ఓ వర్గం భావిస్తోంది. గందరగోళ వాతావరణం సృష్టించేందుకే మాజీ సీఎం వీటిని విడుదల చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

సిద్ధరామయ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కేవలం విశ్రాంతి తీసుకునేందుకే ఆయన అక్కడికి వెళ్లారు. తాజాగా ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓ మంత్రి మాజీ సీఎం సిద్దరామయ్యను  కలిశారు.  

సార్వత్రిక ఎన్నికల తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదని సిద్దరామయ్య ప్రకటనలు చేయడం  కూడ చర్చనీయాంశంగా మారింది. అయితే జెడి(ఎస్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ బుధవారం నాడు ఢీల్లీకి వెళ్ళారు. ఆయన ఢీల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసే అవకాశం లేకపోలేదు.

ఇదిలా ఉంటే ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని కర్ణాటక డీప్యూటీ సీఎం పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను బీజేపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. సిద్ద రామయ్య వ్యవహరశైలి కుమారస్వామి సర్కార్ ముప్పు తీసుకొస్తోందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తోంది.