కీచక ఉపాధ్యాయుడు.. 6 ఏండ్లుగా 142 మంది మైనర్ బాలికలపై.. కట్ చేస్తే..

Haryana: చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కామంతో కళ్లుమూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు. దాదాపు 142 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. దీంతో తాజాగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 

In Haryana 142 Schoolgirls Allege Sexual Assault By Principal Over 6 Years KRJ

Haryana: ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి.. వారిని మంచి ప్రయోజకులుగా మార్చే మహోన్నత వ్యక్తి.  అందుకే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను సమాన హోదా ఇస్తారు. కానీ,  కొందరు ఉపాధ్యాయులు తమ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. ఇలాంటి నీచులను చూసి ఉపాధ్యాయులంతా తలదించుకోవాల్సి వస్తుంది. తాజాగా హర్యానాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

జింద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 142 మంది మైనర్ బాలికలపై ఓ పాఠశాల ప్రిన్సిపాల్ 6 ఏండ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ మొత్తం 390 మంది బాలికల వాంగ్మూలాలను నమోదు చేసి, 142 కేసుల్లో ఫిర్యాదులు నమోదు చేసింది. 

ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఇమ్రాన్ రజా మాట్లాడుతూ..   “సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ మొత్తం 390 మంది బాలికల వాంగ్మూలాలను నమోదు చేసింది.   తాము 142 కేసులకు సంబంధించిన ఫిర్యాదులను ఫార్వార్డ్ చేసాం బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి తదుపరి చర్యల కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ 142 మంది బాలికల్లో ఎక్కువ మంది ప్రిన్సిపాల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించగా, మిగిలిన వారు ఈ దారుణమైన చర్యలకు తాము సాక్షులని చెప్పారు. నిందితుడైన ప్రిన్సిపాల్ ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్నాడు. " అని తెలిపారు. 

విశేషమేమిటంటే..

దాదాపు 15 మంది బాలికలు తన ప్రిన్సిపాల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఆగస్టు 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ తదితరులకు రాశారు. సెప్టెంబరు 13న, హర్యానా మహిళా కమిషన్ లేఖను పరిగణనలోకి తీసుకుని, చర్య కోసం జింద్ పోలీసులకు పంపింది. అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో నిందితుడిని నవంబర్ 4న అరెస్టు చేసి నవంబర్ 7న కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ప్రభుత్వ పాఠశాలలో 60 మంది బాలికలు ప్రిన్సిపాల్‌పై తమ వాంగ్మూలాలను నమోదు చేయడానికి ముందుకు వచ్చినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ గతంలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 142కి చేరిందని అధికారులు తెలిపారు. ఈ కేసును పరిశీలిస్తే, పోలీసు, విద్యాశాఖ అధికారులతో సహా జిల్లా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోలేదని, పోక్సో చట్టం, ముఖ్యంగా సబ్-సెక్షన్లు 19, 20 , 21 ఎఫ్‌ఐఆర్‌ని నిర్దేశిస్తున్నాయని న్యాయ నిపుణుడు తెలిపారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు నివేదించినట్లయితే వీలైనంత త్వరగా నమోదు చేయాలి. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులకు ఒకటిన్నర నెలలు ఎందుకు పట్టిందని కార్యకర్తలు కూడా ప్రశ్నించారు.

డిప్యూటీ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) స్థాయి ముగ్గురు (జిల్లా) అధికారుల బృందం జరిపిన విచారణలో ప్రిన్సిపాల్ దోషిగా తేలాడు. ఇప్పుడు నిందితుడిపై ఛార్జిషీట్ తయారు చేయబడుతుంది. అరెస్టయిన ప్రిన్సిపాల్‌పై తదుపరి చర్యలపై చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని, ఈ అంశంపై తదుపరి విచారణ కోసం అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీ) హరీష్ వాసిస్ట్‌ను నియమించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) దీప్తి గార్గ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నవంబర్ 16న ఏర్పాటైంది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) శ్రీకాంత్ జాదవ్ విచారణ బృందాన్ని 10 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని , ప్రిన్సిపాల్ బారిన పడిన పిల్లలకు  కౌన్సెలింగ్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios