Asianet News TeluguAsianet News Telugu

ఆ స‌మ‌యంలో ..300కు పైగా మృతదేహాలు గంగా పాలు

క‌రోనా క‌ష్ట‌కాలం లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ స‌మ‌యంతో వారి అంతిమ సంస్కారాలు కూడా చేయ‌లేక‌.. ఎంతో మంది మృత‌దేశాల‌ను గంగా న‌ది ప‌రిస‌రాల్లో ప‌డేసి వెళ్లియార‌ని ఎన్​ఎమ్​సీజీ(నేషనల్​ మిషన్​ ఫర్​ క్లీన్​ గంగ) డైరక్టర్​ జనరల్​ రాజీవ్​ రంజన్​ మిశ్రా ర‌చించిన 'గంగా: రీఇమాజినింగ్​, రిజువనేటింగ్​, రీకనెక్టింగ్​' పుస్తకంలో పెర్కొన్నారు.
 

In Covid-19 second wave, river was dumping ground for dead, admits Ganga mission chief
Author
Hyderabad, First Published Dec 24, 2021, 5:46 PM IST

Corona dead bodies in Ganga:  దేశంలో కరోనా మ‌హ‌మ్మారి ఎంత‌టీ విషాదాన్ని మిగిల్చిందో అందరీకి తెలుసు. ఈ క‌రోనా సెకండ్ వేవ్‌.. స‌మ‌యంలో ఎంతో మంది గ‌డ్డు ప‌రిస్థితులెదుర్కొన్నారు. ఈ స‌మ‌యంలో స‌రైన వైద్య స‌దుపాయాలంద‌గా.. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ్డారు. ఈ వైర‌స్ కు బ‌లై వేలాది మంది త‌మ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు..  ఈ స‌మ‌యంలో కొంత మంది చ‌నిపోయినా త‌మ వారికి అంతిమ సంస్కారాలు చేయ‌లేని స్థితిలో నిస్స‌హాయంగా ఉండిపోయారు. 

ఈ క్ర‌మంలో మృత‌దేహాల‌ను నది ప్రాంతాల్లో ప‌డివేసిన ఘ‌ట‌న‌లెన్నో.. ముఖ్యంగా గంగానది తీర ప్రాంతాల్లో మృతదేహాలు కుప్ప‌లు తెప్ప‌లు ప‌డేసిన ఘ‌ట‌లెన్నో ఉన్నాయి. గంగా నదికి, దేశానికి పట్టిన దీన స్థితితో కన్నీరు పెట్టుకున్నారు. కోవిడ్ సెంక‌డ్ వేవ్ సమయంలో గంగ న‌ది మృత‌దేహాల‌ను డంపింగ్
చేసే  గ్రౌండ్ గా మారిందని, యూపీలో అతిభ‌య‌కన స‌మ‌స్య‌గా మారింద‌ని .. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు తాజాగా విడుదలైన ఓ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి.
 
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ ( ఎన్​ఎమ్​సీజీ), నమామి గంగే చీఫ్ రాజీవ్ రంజన్ మిశ్రా  రచించిన Ganga: Reimagining, Rejuvenating, Reconnecting అనే పేరుతో ఓ పుస్త‌కాన్ని ర‌చించారు.   ఈ పుస్తకాన్ని గురువారం  ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ చైర్మన్ బిబెక్ దేబ్రాయ్ ఆవిష్కరించారు. రాజీవ్​ రంజన్​ మిశ్రా 1987 బ్యాచ్​ కు చెందిన ఐఏఎస్​ అధికారి. NMCGలో ఆయ‌న‌ వివిధ హోదాల్లో దాదాపు ఐదేళ్లపాటు సేవలందించారు. 2021 డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ పుస్త‌కంలో ఎన్నో సంచ‌నాలు వెలుగులోకి తీసుక‌వ‌చ్చారు. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో వైరస్​​తో మరణించిన దాదాపు 300మంది మృతదేహాలను గంగా నదిలో పడేసినట్టు వివరించారు. 

Read Also; Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. జాడే మైన్‌లో విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు


క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో .. చాలా మంది ఆస్ప‌త్రుల చూట్టు అధిక మొత్తంలో డ‌బ్బు ఖర్చుపెట్టార‌నీ, ఒక్క‌నొక ద‌శ‌లో మృత‌దేహాల‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించ‌లేక పోయార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో  ఉత్తర్​ప్రదేశ్​లో వివిధ ఘాట్​ల వద్ద గంగా నదిలో మృతదేహాలను పడేశారు. ఈ తరహా ఘటనలు కన్నౌజ్​లో అధికంగా వెలుగుచూశాయని తెలిపారు. కొవిడ్​ మృతదేహాలను ఎలా ఖననం చేయాలనే అంశంపై సరైన అవగాహన లేక‌.. మృత‌దేహాలను గంగా న‌దిలో ప‌డేశార‌ని పేర్కొన్నారు.

Read Also;ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: బదిలీలకు గైడ్‌లైన్స్ విడుదల

 
ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే.. తాను తక్షణమే 59 జిల్లాస్థాయి గంగా నది కమిటీలకు, ఆయా జిల్లాల మెజిస్ట్రేట్​లకు, పంచాయతీల ఆఫీస్​ బేరర్లకు ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని స్పష్టం చేశారు. ఆ స‌మ‌యంలో గంగ న‌దీ శ‌వాలను ప‌డ‌వేసే.. డంపింగ్ యార్డ్ క‌నిపించింద‌ని రాసుకోచ్చారు. ఎన్నో శ‌వాలు  ఉబ్బి, నీటిలో తేలుతూ.. దుర్వాస‌ను వెద‌జ‌ల్లెవ‌నీ, ఇలాంటి దుర్బ‌ర‌, భ‌యాన‌క స‌న్నివేశాల‌ను ఎన్నో చూశాన‌ని చెప్పుకోచ్చారు. గుణించడం, జిల్లా పరిపాలనలు మరియు శ్మశాన వాటికల యొక్క క్రియాత్మక పరిమితులను విస్తరించడం,  యుపి మరియు బీహార్‌ల దహనం చేసే ఘాట్‌ల కారణంగా, గంగా నది చనిపోయినవారిని సులభంగా డంపింగ్ చేసే ప్రదేశంగా మారింది" అని పుస్తకం  లో పెర్కొన్నారు.

Read Also; టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ శుభవార్త: సినిమా టిక్కెట్ ధరల పెంపుకు ఓకే, గరిష్ట ధర ఎంతో తెలుసా..?

అధికారిక లెక్క‌ల ప్ర‌కారం.. గంగ‌న‌దిలో ప‌డ‌వేసిన మృత‌దేహాల సంఖ్య 300 మాత్ర‌మే.. అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం చూస్తే .. ఆ సంఖ్య వేయి దాటి ఉండ‌వ‌చ్చ‌ని , నమామి గంగే పేరుతో దాదాపు ఐదేండ్లుగా  చేప‌ట్టిన కార్య‌క్ర‌మం .. కేవ‌లం వారం, ప‌దిరోజుల్లో నాశ‌మంద‌ని ఆ పుస్త‌కంలో పేర్కొన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఎన్నో న‌ది తీర ప్రాంతాల్లో ఖ‌న‌నం చేశారు. కానీ, ఆ త‌రువాత కురిసిన వ‌ర్షాల కార‌ణం ఎన్నో వేల మృత‌దేహాలు బ‌య‌టి ప‌డ్డాయి. దీంతో అక్క‌డ నీరు కాలిషిత‌మైంద‌ని స్థానికులు భ‌యభ్రంతుల‌కు గురయ్యారు. ఇసుక తిన్నెల్లో లభ్యమైన మృతదేహాలకు మత విశ్వాసాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios