పార్లమెంటులో అరుదైన ఘటన.. విపక్షాల వద్దకు ప్రధాని.. సోనియా గాంధీతో మాట కలిపిన మోడీ
పార్లమెంటు సమావేశాల ప్రారంభ రోజు ప్రధాని మోడీ ప్రతిపక్షాల బెంచీల వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడరు. మంగళవారం ఆమె హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను ప్రస్తావించారు.

న్యూఢిల్లీ: ఈ రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు పార్లమెంటులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రతిపక్షాల వద్దకు వెళ్లారు. ప్రతిపక్షాల బెంచీల వద్దకు వెళ్లి మాట్లాడారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట కలిపారు. ఆరోగ్యం ఎలా ఉన్నదని అడిగారు. మంగళవారం నాటి వారి హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్ గురించి అడిగినట్టు తెలిసింది.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు పలువురు నేతలను ప్రధాని మోడీ కలుసుకుని మాట్లాడారు. అపోజిషన్ బెంచ్‌ల వద్దకు వెళ్లి సోనియా గాంధీతో మాట్లాడారు. మంగళవారం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత బాగానే ఉన్నారా? అంటూ అడిగారు.
అయితే.. పార్లమెంటు సమావేశాల తొలి రోజున నేతలు ఒకరినొకరు పలకరించుకోవడం ఆనవాయితీ అని పీటీఐ న్యూస్ ఏజెన్సీ తెలిపంది.
Also Read: మణిపూర్ ఘటనపై చర్చకు విపక్షాల పట్టు.. రాజ్యసభలో గందరగోళం.. సభ వాయిదా..
బెంగళూరులో విపక్షాల భారీ సభకు హాజరై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. వారు వస్తున్న హెలికాప్టర్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో కలకలం రేగింది. కానీ, కాసేపాగిన తర్వాత వారు మళ్లీ ఢిల్లీకి ప్రయాణమై వెళ్లిపోయారు. తాజాగా, ప్రధాని మోడీ ఈ ఘటన ను ప్రస్తావించారు.
పార్లమెంటులో ప్రధాని మోడీ ఇలా విపక్షాల వద్దకు వచ్చి.. విపక్ష నేతలతో సన్నిహితంగా మాట్లాడటం మాత్రం అరుదైన విషయమే అని చర్చిస్తున్నారు.