ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 508 రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ ‌భారత్ ‌స్టేషన్ పథకం కింద రూ.24,470 కోట్లతో ఈ స్టేషన్ల పునరుద్ధరణ పనులను చేపట్టనున్నారు.

ఆగస్ట్ 6న భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రూ.24,470 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ పనులకు శ్రీకారం చుట్టనుంది. నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానం వుండేలా ‘‘సిటీ సెంటర్స్’’గా స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ చుట్టూ నగరం లేదా పట్టణ అభివృద్ది కేంద్రీకృతమై వుండేలా సమగ్ర దృష్టితో ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుకు ప్రాధాన్యత నిచ్చేలా స్టేషన్ భవనం రూపకల్పన చేస్తున్నారు. 

ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో ఆత్యాధునిక ప్రజా రవాణా సదుపాయాలపై మోడీ తరచుగా అధికారులపై ఒత్తిడి తెస్తూనే వున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా రవాణాకు రైల్వేలు ప్రాధాన్యతనిస్తున్నాయని.. అందుకే రైల్వేస్టేషన్‌లలో ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించాల్సి అవసరం వుందని మోడీ పునరుద్ఘాటించారు. ప్రధాని సూచనలకు అనుగుణంగా దేశంలోని 1309 స్టేషన్‌లను ఆధునికీకరణ చేసేందుకు ‘‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’’ ప్రారంభించారు. 

ఈ 508 స్టేషన్లు దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్‌లలో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉన్నాయి. గుజరాత్ , తెలంగాణలలో 21 చొప్పున, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్నాటకలో 13 ఉన్నాయి. ఈ పునరుద్ధరణ పనుల ద్వారా రైల్వే స్టేషన్‌లలో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించనున్నారు. ట్రాఫిక్ సర్క్యూలేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. 

Scroll to load tweet…