Asianet News TeluguAsianet News Telugu

లింగాయత్ మఠం ప్రధానార్చకుడిగా తొలి ముస్లిం

కర్ణాటకలోని లింగాయత్ మఠానికి తొలిసారిగా ఓ ముస్లిం యువకుడు ప్రధానార్చకుడిగా నియమితులయ్యారు. బసవేశ్వరుడు నిర్దేశించిన మార్గంలో తాను పయనిస్తానని ఆయన అన్నారు.

In a first, Muslim man appointed as main priest of a Lingayat Mutt in Karnataka
Author
Bengaluru, First Published Feb 20, 2020, 4:19 PM IST

బెంగళూరు: కర్ణాటకలోని గదగ్ జిల్లాలో గల లింగాయత్ మఠంలో ప్రధానార్చకుడిగా తొలిసారి ఓ ముస్లిం యువకుడిని నియమించారు. బుధవారం ఈ నియామకం జరిగింది. తనకు ఆశీస్సులు అందాయని, మఠం ప్రధానార్చకుడిగా తన నియామకాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని 33 ఏళ్ల వయస్సుగల దీవాన్ షరీఫ్ అన్నారు. 

తన గురువు బసవేశ్వరుడి మార్గంలో తాను నడుస్తానని, ఎవరు కూడా తన నియామకాన్ని వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు. మఠం సభ్యులు, తన మిత్రులు తనకు సహాయం చేశారని ఆయన అన్నారు.

సమాజం కోసం తన తల్లిదండ్రులు తమ ఆస్తులను, తనను విరాళంగా ఇచ్చారని ఆయన అన్నారు. బసవేశ్వరుడి బోధనలను వారు అనుసరించి ఆ పని చేశారని ఆయన అన్నారు. బసవేశ్వరుడి బోధనలను అనుసరించేవారందరికీ ఆహ్వానం ఉంటుందని, నువ్వు ఏ మతం నుంచి వచ్చావనేది ప్రధానం కాదని ఆయన అన్నారు. 

ఎవరు ఏ మతంలోనైనా పుట్టవచ్చునని, తర్వాత ఎంపిక చేసుకోవచ్చునని ఆయన అన్నారు. బసవేశ్వరుడు బగవేదికి చెందిన 12వ శతాబ్దం సన్యాసి. సంఘ సంస్కర్త అయిన బసవేశ్వరుడు కర్ణాటకలో కుల వ్యవస్థతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. 

తనకు పవిత్రమైన మాల వేసి, బాధ్యతలు అప్పగించారని ఆయన అన్నారు. తనకు ఇష్టలింగాన్ని ఇచ్చారని, తాను ఇష్టలింగధారణ చేశానని చెప్పారు. ధర్మమార్గంలో తాను నడుచుకుంటానని చెప్పారు. ప్రేమ, త్యాగం అనే సందేశాలను ఇచ్చారని, వాటిని తాను ప్రచారం చేస్తానని చెప్పారు.

నువ్వు ఏ కులానికి చెందినవాడివనేది ముఖ్యం కాదని, ఉత్తమమూ, త్యాగమార్గాన్ని అనుసరించడానికి దేవుడు నిర్దేశించినప్పుడు మనుషులు సృష్టించిన పుట్టుక, కులం అనే నిబంధనలు వర్తించవని శ్రీ మురుగరాజేంద్ర కోరనేశ్వర స్వామి అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios