Surat: సినిమా స్టైల్ లో పట్టపగలు అందరూ చూస్తుండగానే 5 నిమిషాల్లో బ్యాంకు లూటీ చేశారు దొంగలు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కు చెందిన ఒక బ్రాంచ్ లోకి ప్రవేశించిన ఐదుగురు దొంగలు కేవలం ఐదు నిమిషాల్లో రూ.14 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ చోరీ సమాచారం అందుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Thieves robbed the bank in front of everyone: సినిమా స్టైల్ లో పట్టపగలు అందరూ చూస్తుండగానే 5 నిమిషాల్లో బ్యాంకు లూటీ చేశారు దొంగలు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. సూరత్ లోని ఓ బ్యాంకుల్లోకి ప్రవేశించిన ఐదుగురు దొంగలు కేవలం ఐదు నిమిషాల్లో రూ.14 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ చోరీ అనంతరం సూరత్ పోలీసులు నగర వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ లోని సూరత్ లో శుక్రవారం పట్టపగలు ఐదుగురు దొంగలు బ్యాంకును దోచుకుని రూ.14 లక్షల నగదుతో పరారయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ లో దోపిడీ సమయంలో దొంగలు హెల్మెట్లు ధరించి మోటారు సైకిళ్లపై అక్కడకు వచ్చారు. అనంతరం బ్యాంకులోకి చొరపడ్డారు. ఆయుధాలతో అక్కడున్న బ్యాంకు సిబ్బందిని బెదిరింపులకు గురిచేసి.. డబ్బుతో పరారయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయుధాలతో పట్టపగలు బ్యాంకు దోపిడీకి పాల్పడిన దొంగలు డబ్బు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంకు లోపల, వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో దొంగల కదలికలు రికార్డయ్యాయి.
ఈ వీడియోలో దొంగలు రెండు మోటారు సైకిళ్లపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ కు వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకు లోపల ఉన్న ఫుటేజీలో దొంగలు భవనంలోకి ప్రవేశించి వెంటనే తమ వద్ద ఉన్న పిస్టోల్ లను బయటకు తీసి బ్యాంకు ఉద్యోగులతో పాటు ఖాతాదారుల వైపు చూపిస్తూ బెదిరించారు. బ్యాంకు సిబ్బంది స్పందించే లోపే దొంగలు వారికి ఆయుధాలు చూపించి బ్యాంకు కౌంటర్ల నుంచి డబ్బును తమ బ్యాగుల్లో వేసుకుని వెళ్లిపోయారు. మొదట బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులందరినీ దొంగలు ఓ గదిలోకి లాక్కెళ్లారు. పింక్ షర్ట్ ధరించిన దొంగల్లో ఒకరు తన తుపాకీతో కౌంటర్లలో డబ్బు కోసం వెతకడం ప్రారంభించడం వీడియోలో కనిపించింది.
ఆ తర్వాత నల్లచొక్కా ధరించి, ముఖానికి కండువా మాత్రమే వేసుకున్న దొంగ తన బ్యాగులో డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. బ్యాగ్ నిండగానే బ్యాంకు ఆవరణ నుంచి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే ఐదుగురు దొంగలు బ్యాంకు నుంచి దాదాపు రూ.14 లక్షల నగదుతో పరారవడంతో బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు షాక్ కు గురయ్యారు. చోరీ సమాచారం అందుకున్న పోలీసులు సూరత్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూరత్ పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి నగర వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా చెక్‌పోస్టులు, రోడ్‌బ్లాక్‌లు ఏర్పాటు చేశారు.
