Asianet News TeluguAsianet News Telugu

1987 నాటి మాట... మన సబ్బులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఇమ్రాన్ ఖాన్

భారతీయ ఉత్పత్తులకు ఇమ్రాన్‌ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడని తెలుసా..? అప్పట్లో తన భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే ఇమ్రాన్‌కు పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నారు. ఇందుకు భారతీయులు అతీతం కాదు.. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇమ్రాన్‌ను సింతాల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా 1987లో నియమించింది.

Imran Khan brand ambassador as cinthol soap in 1987

రక్తపాతం, ఆందోళన, హింసా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి.. తమ దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఏర్పడాలని ఉగ్రవాదులకు భయపడకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వైపు మెజార్టీ ప్రజలు మొగ్గుచూపారని తెలుస్తోంది.. ఆ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పీఠానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు.

దీంతో ప్రపంచం మొత్తం పాక్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ జీవిత విశేషాల కోసం నెట్టింట్లో బాగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. దేశంలోని సెలబ్రిటీల చేత కార్పోరేట్  సంస్థలు తమ ఉత్పత్తులను బ్రాండింగ్ చేయించుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే భారతీయ ఉత్పత్తులకు ఇమ్రాన్‌ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడని తెలుసా..?

అప్పట్లో తన భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే ఇమ్రాన్‌కు పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నారు. ఇందుకు భారతీయులు అతీతం కాదు.. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇమ్రాన్‌ను సింతాల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా 1987లో నియమించింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ గోద్రెజ్ సంస్థ తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.. నాటి ఫోటోను షేర్ చేస్తూ... ‘పేస్ ఆఫ్ ది ఖాన్.. సోప్ ఆఫ్ ది ఖాన్’ అని పోస్ట్ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios