Asianet News TeluguAsianet News Telugu

దుర్గా విగ్రహాల నిమజ్జనం.. విషాద ఘ‌ట‌న‌ల్లో 10 మంది మృతి.. ప‌లువురు గ‌ల్లంతు

Durga idols immersion: దేశంలో ద‌స‌రా వేడుక‌లు, న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా జరుపుకున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో ప‌లు చోట్ల విషాద ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. దుర్గా మాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా చోటుచేసుకున్న ప్ర‌మాదాల కార‌ణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 

Immersion of Durga idols.. 10 people died in tragic incidents.. Many are missing
Author
First Published Oct 6, 2022, 2:21 PM IST

10 dead during Durga idols immersion: దేశ‌వ్యాప్తంగా ఎంతో ఘ‌నంగా జరుపుకునే విజ‌య ద‌శ‌మి (ద‌స‌రా) వేడుక‌లు, న‌వ‌రాత్రి ఉత్స‌వాలు బుధ‌వారం నాడు ముగిశాయి. అయితే, ఇదే స‌మ‌యంలో ప‌లు చోట్ల విషాద ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. దుర్గా మాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా చోటుచేసుకున్న ప్ర‌మాదాల కార‌ణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. డ‌జ‌న్ల మంది గ‌ల్లంత‌య్యారు. 

వివ‌రాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో న‌వ‌రాత్రుల క్ర‌మంలో ఏర్పాటు చేసిన  దుర్గామాత విగ్రహ నిమజ్జనం (విసర్జన్) సందర్భంగా ప‌లు విషాద ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.  పశ్చిమ బెంగాల్‌లోని జైల్‌పైగురిలో దుర్గా దేవి విగ్రహాన్ని విసర్జించే సమయంలో మాల్ నదికి వరదలు రావడంతో ఏడుగురు మరణించారు. అలాగే, అనేక మంది తప్పిపోయినట్లు స‌మాచారం. రాత్రి 9:15 గంటల ప్రాంతంలో పలువురు భక్తులు ఒడ్డున గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. "మేము సుమారు 60 మందిని రక్షించాము. వారిలో 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. మొదట్లో, రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, అయితే మరో ఐదుగురు తరువాత కనుగొనబడ్డారు" అని జల్పాయ్ గురి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోదార బసు రాత్రి 11 గంటలకు స్థానిక మీడియాతో అన్నారు. రాష్ట్రంలో ఈ వారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మల్ నదిలో వరదలు పోటెత్తుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వారాంతం (అక్టోబర్ 8, 9 తేదీల్లో) రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దుర్గా విగ్రహం నిమజ్జనం సందర్భంగా యమునా నదిలో మునిగి 15 ఏళ్ల బాలుడు, 19, 22 ఏళ్ల ఇద్దరు యువకులు చనిపోయారు. సాయంత్రం వరకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఎవరూ కనిపించలేదు. అలాగే, రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో బుధవారం దుర్గామాత విగ్రహం నిమజ్జనం సందర్భంగా వర్షపు నీటితో నిండిన కాలువలో ఆరుగురు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

అజ్మీర్ పోలీసు సూపరింటెండెంట్ చునా రామ్ జాట్ విలేకరులతో మాట్లాడుతూ.. “సంఘటన జరిగిన కందకాన్ని స్థానికులు తరచుగా విగ్రహ నిమజ్జనం కోసం ఉపయోగిస్తారు. మృతుడు ఇది లోతులేని గుంటగా భావించి కిందకు దిగాడు, కానీ అది లోతుగా ఉండ‌టంతో వారందరూ మునిగిపోయారు" అని చెప్పారు. సెప్టెంబర్ 9న జరిగిన గణేష్ విసర్జన సందర్భంగా కూడా ఇలాంటి సంఘటనలు నివేదించబడ్డాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, హర్యానాలో ఎనిమిది మంది మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios