IMD: దేశంలో ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. మ‌రీ  ముఖ్యంగా ఉత్త‌ర‌భార‌తంలో ఎండ‌ల తీవ్ర‌త అధికం అవుతున్న త‌రుణంలో భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) అనేక న‌గ‌రాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  

heatwaves: దేశంలో ఎండ‌లు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్ర‌త‌లు గ‌రిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్ప‌టికే దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రానున్న రోజుల్లో వేగిగాలుల తీవ్ర‌త‌తో ఉష్ణోగ్ర‌త‌లు కొత్త రికార్డు సృష్టించే అవకాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) అనేక న‌గ‌రాల‌కు హెచ్చరిక‌లు జారీ చేసింది. ఏప్రిల్ 8 నాటికి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 42 డిగ్రీల‌కు చేరుకుంటుంద‌ని అంచాన వేసింది. ఇక ఏప్రిల్ 9, 10 తేదీల్లో ప‌లు న‌గ‌రాల్లో 43 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతాయ‌ని ఐఎండీ పేర్కొంది. 

ఎండ‌ల తీవ్ర‌త అధికం కావ‌డంతో IMD ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో హీట్‌వేవ్ హెచ్చరికల‌ను జారీ చేసింది, ఉష్ణోగ్రతలు గ‌ణ‌నీయంగా పెరుగుతాయ‌ని అంచా వేసింది. ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలో ప్ర‌స్తుతం ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో పాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. సోమవారం నాడు అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌ 41 డిగ్రీలు దాటింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే రోజుల్లో ఎండ‌లు మ‌రింత‌గా పెర‌గ‌నున్నాయి. ప్ర‌జ‌లు ఎండ‌ల ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ క్ర‌మంలోనే IMD హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది.

భారత వాతావరణ శాఖ (IMD) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. రాబోయే 6 రోజుల్లో వేడిగాలులు తీవ్రంగా ఉంటాయి. గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుండి వేడి గాలులు వీస్తున్నాయని, దీని కారణంగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయ‌ని తెలిపింది. పాకిస్థాన్, రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడి గాలులు ఉత్తరప్రదేశ్‌ను తాకుతున్నాయి. రాజధాని లక్నోతో పాటు యూపీలోని అన్ని నగరాల్లో ఏప్రిల్‌లోనే వేడిగాలులు వీయడానికి కారణం ఇదే. రానున్న వారం రోజుల్లో వేడి మరింత పెరగనుంది. IMD ప్రకారం ఏప్రిల్ 8 నాటికి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంటుంది. ఏప్రిల్ 9 మరియు 10 తేదీలలో ఎండ‌లు మండిపోనున్నాయి. గ‌రిష్టంగా ఉష్ణోగ్ర‌త‌లు 43 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటే అవ‌కాశ‌ముంది. 

సోమవారం లక్నోలో విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గానూ నమోదైంది. ఉదయం నుంచి వేడి ఉధృతంగా ఉంది, ఉదయం 9 గంటలకు ఉష్ణోగ్ర‌త 27 డిగ్రీలకు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు గ‌రిష్టంగా 41 డిగ్రీలుగా నమోదైంది. విపరీతమైన వేడి మరియు వేడిగాలుల వంటి పరిస్థితుల దృష్ట్యా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉండే మధ్యాహ్నం సమయంలో ఇళ్ళ నుండి బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. బ‌య‌ట‌కు వెళ్ల‌డం త‌ప్ప‌ని ప‌రిస్థితి అయితే, నీళ్లు ఎక్కువ‌గా తాగి, శ‌రీరంపై నీడ ఉండేలా గొడుగు లేదా దేనినైనా కప్పుకుని బయటకు వెళ్లాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం దోసకాయ, పుచ్చకాయ, సీజనల్ పండ్లను ఎక్కువ ప‌రిమాణంలో తీసుకోవాల‌ని చెబుతున్నారు. ఇదిలావుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.