Asianet News TeluguAsianet News Telugu

Pegasus spyware: పెగాస‌స్‌తో నిఘా దేశ‌ద్రోహ‌మే.. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు !

Pegasus spyware: గ‌తేడాది దేశంలో తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టించిన పెగాస‌స్ స్పైవేర్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. పెగాస‌స్ తో తాము ఎవ‌రీ మీద నిఘా పెట్ట‌లేద‌నీ, దానిని కొనుగోలు చేయ‌లేద‌ని ఇదివ‌ర‌కే ప్ర‌భుత్వం పేర్కొంది. దేశంలోని ప్ర‌తిప‌క్ష నేతలు, జ‌ర్న‌లిస్టులు, స‌మాజిక కార్య‌క‌ర్త‌లు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో దీనిపై సుప్రీంకోర్టు క‌మిటీ ద‌ర్యాప్తు చేస్తోంది. అయితే, ఇజ్రాయిల్‌తో కుదిరిన ర‌క్ష‌ణ ఒప్పందంలో భాగంగా పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను భార‌త్ కొనుగోలు చేసింద‌ని న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక పేర్కొన‌డంతో.. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ధాని మోడీ ప్రభుత్వంపై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 

Illegal snooping using Pegasus amounts to treason: Congress reacts to report on spyware
Author
Hyderabad, First Published Jan 29, 2022, 1:21 PM IST

Pegasus spyware: గ‌తేడాది దేశంలో తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టించిన పెగాస‌స్ స్పైవేర్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. పెగాస‌స్ తాము ఎవ‌రీ మీద నిఘా పెట్ట‌లేద‌నీ, దానిని కొనుగోలు చేయ‌లేద‌ని ఇదివ‌ర‌కే ప్ర‌భుత్వం పేర్కొంది. దేశంలోని ప్ర‌తిప‌క్ష నేతలు, జ‌ర్న‌లిస్టులు, స‌మాజిక కార్య‌క‌ర్త‌లు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో దీనిపై సుప్రీంకోర్టు క‌మిటీ ద‌ర్యాప్తు చేస్తోంది. అయితే, ఇజ్రాయిల్‌తో కుదిరిన ర‌క్ష‌ణ ఒప్పందంలో భాగంగా పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను భార‌త్ కొనుగోలు చేసింద‌ని న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక పేర్కొన‌డంతో.. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ధాని మోడీ సర్కారుపై  మ‌ళ్లీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అక్ర‌మరీతిలో స్పైవేర్ (Pegasus spyware)ను ఉప‌యోగించి పౌరుల‌పై నిఘా పెట్ట‌డం దేశ ద్రోహ‌మే అవుతుంద‌నీ, చ‌ట్టానికి అతీతులు ఎవ‌ర‌కూ కాద‌నీ ఘాటు వ్యాఖ్యాలు చేసింది కాంగ్రెస్‌. న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక క‌థ‌నంలో మ‌ళ్లీ దేశంలో పెగాస‌స్ స్పైవేర్ వ్య‌వ‌హారం మ‌రింత‌గా ముదిరే అవ‌కాశముంది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో దీనిని లేవ‌నేత్తే అవ‌కాశమూ లేక‌పోలేదు. 

ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్‌వో (NSO) గ్రూప్ త‌యారు చేసిన పెగాస‌స్ స్పై వేర్ (Pegasus spyware)ను ఉప‌యోగించి దేశ పౌరుల‌పై నిఘా పెట్ట‌డం.. అది కూడా అక్ర‌మరీతిలో ఉండ‌టం దేశ‌ద్రోహ‌మే అవుతుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, పార్ల‌మెంట్ స‌భ్యులు మల్లికార్జున ఖ‌ర్గే అన్నారు. ప్ర‌ధాని మోడీ స‌ర్కార్ ఎందుకు శ‌త్రువులా వ్య‌హ‌రించిందనీ, దేశ పౌరుల మీదే యుద్ధ ఆయుధాన్ని ఎందుకు వాడింది? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. పెగాస‌స్ స్పై సాఫ్ట్‌వేర్‌తో అక్ర‌మంగా నిఘా పెట్ట‌డం దేశ‌ద్రోహం అవుతుంద‌నీ, చ‌ట్టం క‌న్నా ఎవ‌రూ గొప్ప కాదు అని, ఈ కేసులో న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. ఇప్ప‌టికే పెగాస‌స్ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లో పాటు స‌మాజిక కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్టులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ స‌మాశాలు ప్రారంభం కానుండ‌టం, త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గుతున్న నేప‌థ్యంలో ప్రతిప‌క్ష పార్టీలు పెగాస‌స్ స్పైవేర్ అంశాన్ని మ‌రింత‌గా లేవ‌నేత్తే అవ‌కాశముంది. న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక క‌థ‌నం కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుతో పాటు ఎన్నిక‌ల జ‌ర‌గనున్న ప్రాంతాల్లో ప్ర‌తికూల అంశాల‌ను సృష్టించే అవ‌కాశ‌ముంది.

 

కాగా, న్యూయార్క్ టైమ్స్ పెగాస‌స్ స్పైవేర్  క‌థ‌నంపై మోడీ స‌ర్కారు స్పంద‌న‌ను మీడియా కోర‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎలాంటి స్పంద‌న‌లు చేయ‌లేదు. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌ను ప్ర‌స్తావించిన కాంగ్రెస్ ప్రతినిధి షామా మహ్మద్.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా భారత పౌరులపై అక్ర‌మ రీతిలో నిఘా పెట్ట‌డానికి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు.. మిలిటరీ-గ్రేడ్ స్పైవేర్ (ఇజ్రాయిల్-పెగాస‌స్ స్పైవేర్‌)ను ఉప‌యోగించింద‌న‌డానికి ఈ క‌థ‌నాలు తిరుగులేని రుజువు అని పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ పెగాస‌స్ నివేదిక‌ల‌ను బ‌హిర్గ‌తం  చేయ‌డంతో మోడీ స‌ర్కారు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుతో పాటు పార్ల‌మెంటును త‌ప్పుదోవ ప‌ట్టించింద‌ని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయ‌కులు శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు.


"నరేంద్రమోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?  స్పైవేర్ పై అనుమానాల‌ను స్పష్టం చేయడం@PMOIndia  విధి. ఇజ్రాయెలీ NSO కంపెనీ విక్రయించిన 300 కోట్ల స్పైవేర్ పెగాసస్‌కు పౌరుల సొమ్మును ఉప‌యోగించార‌ని న్యూయార్క్ టైమ్స్ ఈరోజు వెల్లడించింది" అని ఆయన ట్వీట్ చేశారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఒక ట్వీట్‌లో, స్పైవేర్‌ను రక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగించలేదని, ప్రతిపక్షాలు మరియు జర్నలిస్టులను స్నూప్ చేయడానికి ఉపయోగించారని ఆరోపించారు. 'బీజేపీ ఉంటేనే సాధ్యమవుతుంది.. దేశాన్ని బిగ్ బాస్ షోగా మార్చారు' అంటూ హిందీలో ట్వీట్ చేసింది. బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సైతం దీనిపై స్పందిస్తూ.. ట్వీట్ చేశారు. 

కాగా, ఇజ్రాయిల్ కు చెందిన NSO గ్రూప్ ఫోన్ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా భారత మంత్రులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులతో సహా చాలా మంది పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని పెగాస‌స్ స్పై వేర్ తో వారిపై నిఘా పెట్టార‌ని ఓ అంతర్జాతీయ పరిశోధనాత్మక కన్సార్టియం గత సంవత్సరం సంచ‌ల‌న విష‌యాల‌ను వెలుగులోకి తీసుకుచ్చింది.  ఇది సుప్రీంకోర్టుకు చేర‌డంతో న్యాయ‌స్థానం ముగ్గురు సభ్యుల స్వతంత్ర నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios