పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో మంగళవారం ఓ అక్రమ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఈ అక్రమ ఫ్యాక్టరీ ఓనర్ ఒడిశాలోని హాస్పిటల్‌లో మరణించాడు. 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎగ్రా పేలుడు కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాలోని కటక్‌లో హాస్పిటల్‌లో చికిత్సీ తీసుకుంటూ మరణించాడు. పశ్చిమ బెంగాల్ ఈస్ట్ మెదినీపూర్ జిల్లాలో ఓ అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో తీవ్రంగా గాయపడ్డ ఫైర్ ప్యాక్టరీ ఓనర్ క్రిష్ణపాద బాగ్ అలియాస్ భాను బాగ్ ఎవరు చూడకముందే బయటపడ్డాడు. అక్కడి నంచి పారిపోయి ఒడిశాలోని బాలాసోర్ హాస్పిటల్‌లో స్వయంగా అడ్మిట్ అయ్యాడు.ఆ తర్వాత కటక్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు. శుక్రవారం ఉదయం ఈ హాస్పిటల్‌లోనే ఆయన మరణించాడు. ఈస్ట్ మేదినీపూర్ పేలుడు ఘటనలో 9 మంది మరణించారు.

ఈ పేలుడు కేసును వెస్ట్ బెంగల్ సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. కానీ, బాగ్ నుంచి వాంగ్మూలాన్ని తీసుకోలేకపోయింది. ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆయనను విచారించడం సాధ్యం కాలేదని కొన్ని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. 

ఇదిలా ఉండగా ఆ పేలుడు సంభవించిన ఏరియాకు సమీపంలో 15 కిలోమీటర్ల పరిధిలో ఈస్ట్ మేదినీపూర్ జిల్లాకు చెందిన ఖడికూల్ గ్రామంలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. స్థానిక గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ పేలుడు పదార్థాలను రికవరీ చేసుకున్నారు. కమర్దిహ గ్రామంలోని మరో క్రాకర్ ఫ్యాక్టరీ నుంచి పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. కొన్ని చిత్రాల ప్రకారం గన్ పౌడర్, క్రాకర్ తయారీ పదార్థాలు కూడా రికవరీ అయినట్టు తెలుస్తున్నది. ఆ ఫ్యాక్టరీ ఓనర్‌ను గుర్తించారు. అయితే, అతను పరారీలో ఉన్నాడు. 

Also Read: రోమ్ తగలబడిపోతుంటే.. ఫిడేల్ వాయించినట్టు: మణిపూర్ హింసను పేర్కొంటూ కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

ఈ కేసును ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్‌కు టీఎంసీ కూడా అంగీకారం తెలుపుతున్నది. ఆ ఏరియా తమ ఇన్‌ఫ్లుయెన్స్‌లో లేదనీ చెబుతున్నది.

ఈ అక్రమ ఫ్యాక్టరీలలో బాంబులు తయారు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పంచాయతీ ఎన్నికలు సమీపించాయని, త్రినముల్ కాంగ్రెస్, ఫ్యాక్టరీ యజమానులు కుమ్మక్కయ్యారని పేర్కొంది. రాష్ట్ర పోలీసులు ఈ అక్రమ ఫ్యాక్టరీలపై కన్నేయలేదని తెలిపింది.