ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌లో వర్గాల మధ్య జరిగిన హింస కనీసం 73 మందిని బలిగొంది. మైతేయి కమ్యూనిటీకి ఎస్టీ హోదా ఇవ్వాలనే అంశం కేంద్రం వీరికి, కుకి తెగకు మధ్య దాడులు జరిగాయి. మే 3వ తేదీన హింస జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రి కూడా ఆ రాష్ట్రానికి వెళ్లలేదని, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా కేంద్రం తీరు ఉన్నదని మణిపూర్‌లో పర్యటించిన కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రంలో తీవ్ర హింస పేట్రేగింది. ఈ నెల 3వ తేదీ, 5వ తేదీల్లో అక్కడ హింసాత్మక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం 73 మంది మరణించారు. మైతేయి, కుకి తెగల మధ్య ఘర్షణలు హింసాత్మకం కావడంతో ఈ మారణాకాండ జరిగింది. మణిపూర్‌లో మైతేయి వర్గానికి ట్రైబల్ హోదా ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ హింస పెచ్చరిల్లింది. తీవ్ర హింస చెలరేగిన కేంద్ర ప్రభుత్వం, ఇతర విపక్షాల, మీడియా కూడా పెద్దగా వీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఫలితంగా చర్చ పెద్దగా జరగలేదు. తాజాగా, కాంగ్రెస్ నేతలు మణిపూర్‌లో పర్యటించి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోమ్ నగరం తగలబడి పోతుంటే చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు అనే వ్యాఖ్యను రాజకీయ నేతలు, ఇతరు కార్యకర్తలు తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు మిన్నకుండిపోయాయనే సందర్భంలో ఉపయోగిస్తుంటాయి. ఇదే వ్యాఖ్యను తాజాగా కాంగ్రెస్ చేసింది.

ఈ హింసకు కారణాలు, నష్టం పై నివేదిక రూపొందించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ముగ్గురు సభ్యులతో ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ముకుల్ వాస్నిక్ సారథ్యంలో మణిపూర్‌లో పర్యటించింది. 

‘యుద్ధ ప్రాతిపదికన అక్కడ చర్యలు తీసుకోవాల్సింది. దురదృష్టవశాత్తు అలా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ అక్కడ చర్యలు కనిపించవు’ అని వాస్నిక్ శుక్రవారం అన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జార్ఖండ్ మాజీ ఎంపీ అజయ్ కుమార్, త్రిపుర ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మాన్‌లతో మణిపూర్ రాజధాని ఇంఫాల్ పర్యటించారు. 

Also Read: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోబోతున్న బీజేపీ నేత కుమార్తె.. వెడ్డింగ్ కార్డుపై సోషల్ మీడియాలో కామెంట్లు

మణిపూర్‌లో తరుచూ కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరి వారానికి ఒక సారైనా పర్యటించేవారని, కానీ, ఈ హింస జరిగిన 15 రోజులకు చేరువ అవుతున్నా ఇప్పటికీ ఒక్క కేంద్ర మంత్రి కూడా అక్కడికి వెళ్లలేదని వాస్నిక్ అన్నారు. అందుకే దీన్ని రోమ్ నగరం తగలబడి పోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే వ్యాఖ్యతో విమర్శిస్తున్నట్టు తెలిపారు.

ఈ మణిపూర్ హింసను రాజకీయం చేయాలని అనుకోవడం లేదని, అందుకే వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి రిలీఫ్ క్యాంప్‌లను పర్యవేక్షిస్తున్నవారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. తాము అన్ని బ్లాక్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో మాట్లాడామని వివరించారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత కూడా మరికొందరితో సంప్రదింపులు జరుపుతామని, ఆ తర్వాత వాటి ఆధారంగా నివేదిక రూపొందించి సమర్పిస్తామని చెప్పారు. మణిపూర్ గవర్నర్ అనుసూయి ఊకేతోనూ మాట్లాడామని, త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారని తెలిపారు.