కరుణ కోసం గళమెత్తిన ఇళయరాజా.. ఉద్వేగంతో పాటపాడిన స్వరమాంత్రికుడు

ilayaraja sings song for karunanidhi
Highlights

తమ అధినేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ డీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్నాయి. దీంతో అభిమానుల తాకిడితో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న వారిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ జాబితాలో స్వరమాంత్రికుడు ఇళయరాజా కూడా చేరారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లుగా  తెలుస్తోంది. ఐసీయూలో నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తమ అధినేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ డీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్నాయి.

దీంతో అభిమానుల తాకిడితో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న వారిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ జాబితాలో స్వరమాంత్రికుడు ఇళయరాజా కూడా చేరారు.. తాను ఎంతగానో అభిమానించే నాయకుడు క్షేమంగా రావాలని కోరుకుంటూ ఇళయరాజా స్వయంగా పాటపాడారు.. ‘లేచిరా మమ్ముల్ని చూసేందుకు’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం తమిళనాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 
 

loader