న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో  పనిచేసే 39 మంది పారిశుద్య కార్మికులకు కరోనా సోకింది. దీంతో  వారందరినీ క్వారంటైన్ కి తరలించారు.

ఈ 39 మంది పారిశుద్య కార్మికులు ఎవరెవరిని కలిశారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. పారిశుద్య కార్మికులుగా పనిచేస్తున్న వీరు ఎక్కడెక్కడ పనిచేశారు.. ఆ ప్రాంతంలో పరిస్థితులపై కూడ అధికారులు ఆరా తీయనున్నారు.

ఢిల్లీలో ఇప్పటికే 2376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా 50 మంది మరణించారు. దేశంలో ఎక్కువ కేసులు నమోదౌతున్న రాష్ట్రంగా ఢిల్లీ చేరింది. 

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆధారంగా మూడో స్థానంలో నిలిచింది.మహారాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రం నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: మార్చురీలోనే 10 రోజులు డెడ్ బాడీ, అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడు మీడియాకు తెలిపారు.రాష్ట్రంలో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న నలుగురు కరోనా రోగులకు ఫ్లాస్మా థెరపీతో చికిత్స అందించనున్నట్టుగా సీఎం కేజ్రీవాల్ చెప్పారు.