జేఈఈ -2018 రిజల్ట్స్: విశాఖ హేమంత్‌కు ఏడో ర్యాంక్

First Published 10, Jun 2018, 1:09 PM IST
IIT JEE Advanced Result 2018 declared at results.
Highlights

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు


న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఆదివారం నాడు  ఐఐటీ కాన్పూర్ యూనివర్శిటీ విడుదల చేసింది.

ఐఐటీల్లో ప్రవేశాల కోసం కాన్పూర్ యూనివర్శిటీ ఈ ఏడాది మే 20వ తేదిన  ఈ పరీక్షలను నిర్వహించింది. జేఈఈ 2018 అడ్వాన్స్ డ్ పరీక్షలకు 1,55,158 మంది హాజరయ్యారు. ఇందులో 18,138 మందికి ఐఐటిల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. అర్హత సాధించినవారిలో 16,062 మంది పురుషులుండగా, 2076 మంది మహిళలున్నారు. 

 
 ప్రణవ్‌ గోయల్‌ ఆలిండియా టాప్‌ ర్యాంకు సాధించారు. ప్రణవ్‌ 360 మార్కులకు గాను 337 మార్కులు పొందారు. ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన సాహిల్‌ జైన్‌ రెండో ర్యాంకు, ఢిల్లీ ఐఐటీకి చెందిన కాలాష్‌ గుప్తా మూడో ర్యాంకు పొందారు. మహిళల క్యాటగిరిలో మీనాల్‌ ప్రకాశ్‌ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. మీనాల్‌ 318 మార్కులు పొంది సీఆర్‌ఎల్‌లో ఆరో ర్యాంకు సాధించారు.

విశాఖపట్నంకు చెందిన కేవీఆర్‌ హేమంత్‌ కుమార్‌ చోడిపిల్లి ఆలిండియా ఏడో ర్యాంకు సాధించడంతో పాటు కాన్పూర్‌ ఐఐటీ పరిధిలో టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ క్యాటగిరిలో హైదరాబాద్‌ విద్యార్థి శివతరుణ్‌ మొదటి ర్యాంకు సాధించారు. కాన్పూర్‌ ఐఐటీ పరిధిలో మహిళల విభాగంలో వినీత వెన్నెల 261మార్కులు సాధించి టాప్‌లో నిలిచారు. 

loader