Asianet News TeluguAsianet News Telugu

చలి మంట కాచుకోవడానికి ఆ దొంగ ఏం చేశాడో తెలిస్తే నివ్వెరబోవాల్సిందే..

చలిమంట కాచుకోవడానికి అందుబాటులో ఏమీ లేవని ఆ దొంగ ఏకంగా బైక్ కే నిప్పంటించాడు. ఆది దొంగతనం చేసి తీసుకొచ్చిన బైక్ కావడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈ ఘటన జరిగింది. 

If you know what the thief did to keep the fire burning, you should be scared.
Author
Nagpur, First Published Dec 26, 2021, 11:16 AM IST

చ‌లి గ‌జ గ‌జ వణికిస్తోంది. కొన్ని రోజుల నుంచి ఉష్టోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డంతో విప‌రీతంగా చ‌లి పెరిగింది. అయితే సాధార‌ణంగా చ‌లి పెడితే ఎవ‌రైనా ఏం చేస్తారు ? స్వెట‌ర్లు తొడ్డుక్కుంటారు. ఇంటి త‌లుపుల‌న్నీ మూసేస్తారు. చ‌ల్లగాలి వ‌చ్చే మార్గాలు వెతికి వాటిని మూసేయడానికి ప్ర‌య‌త్నిస్తారు. రెండు మూడు దుప్ప‌ట్లు క‌ప్పుకుంటారు. ఇవ‌న్నీ చేసినా చ‌లి త‌గ్గ‌క‌పోతే మాత్రం ఇక చ‌లి మంట వేస్తారు. క‌ర్ర ముక్క‌లు ఏరుకొచ్చి చ‌లి మంట వేసుకొని కూర్చుంటారు. అయితే చ‌లి మంట వేసుకోవ‌డానికి ఓ దొంగ ఏం చేశాడో తెలుసా ? ఈ విష‌యం తెలిస్తే నిజంగా అందరూ నివ్వెర‌బోతారు.

దమ్ముంటే గల్లా పట్టుకుని నిలదీయి... ఆ ఉద్యోగాలెక్కడో మీ మోదీని అడుగు..: బండి సంజయ్ కి కేటీఆర్ బహిరంగ లేఖ

అత‌డి వృత్తి దొంగ‌త‌నం. బైక్ ల‌ను దొంగ‌త‌నం చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే మ‌హారాష్ట్రలోనే ఓ ప‌ట్ట‌ణంలో చాలా బైక్‌లు దొంగ‌త‌నం చేశాడు. వాటిన‌న్నింటినీ ఓ చోట దాచి పెట్టాడు. ఇప్పుడు అస‌లే చ‌లికాలం క‌దా. ఆ దొంగ‌కు బాగా చ‌లివేసింది. అటూ ఇటూ చూస్తే క‌ర్ర ముక్క‌లాంటివేమీ క‌నిపించ‌లేదు. దీంతో ఏం చేయాలో తెలియ‌లేదు. దీంతో అత‌డు దొంగ‌త‌నం చేసి తీసుకొచ్చిన బైక్ లు క‌నిపించాయి. దాంట్లో ఒక‌దానికి నిప్పంటించి చ‌లి కాచుకుంటే బాగుంటుంది క‌దా అనే ఆలోచ‌న వ‌చ్చింది. అనుకున్న‌దే త‌డవుగా అందులో నుంచి ఒక బైక్ ప‌క్క‌కి తీసుకున్నాడు. కొంత పెట్రోల్ తీసుకొచ్చి బైక్ కు నిప్పంటించాడు. దాంతో చ‌లికాచుకున్నాడు. ఈ అతి ఖ‌రీదైన చ‌లి మంట ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. కొంత కాలం తరువాత ఆ దొంగ‌ను పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 

నేను అలా అనలేదు .. సాగు చట్టాలకు సంబంధించిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Narendra Singh Tomar

నాగ్ పూర్ ప‌ట్ట‌ణంలో బైక్‌లు దొంగ‌తనానికి గురువుతున్నాయి. ప్ర‌తీ రోజు బైక్ లు చోరీ అవుతున్నాయి. త‌మ బైక్‌లు పోయాయంటూ పోలీసుల వ‌చ్చే ఫిర్యాదులు ఎక్కువ‌య్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బైక్‌లు ఎక్క‌డమ‌యామ‌వుతున్నాయి ? ఎటు పోతున్నాయి అని ఓ అంచ‌నాకు వ‌చ్చారు. పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు. కొంత కాలం త‌రువాత ఓ దొంగ ముఠాను ప‌ట్టుకున్నారు. ఇందులో ఐదుగురు దొంగ‌లున్నారు. ఇందులో ఒక‌రి పేరు స‌ర్ఫ‌రాజ్‌. ఈ ముఠా మొత్తం కలిపి 10 బైక్‌లను చోరీ చేశాయి. అయితే పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేసిన‌ప్పుడు 9 బైక్‌లు మాత్ర‌మే దొరికాయి. ఇంకో బైక్ ఆచూకీ దొర‌క‌లేదు. ముఠాలోని దొంగ‌లంతా క‌లిపి 10 బైక్ లు దొంగ‌త‌నం చేస్తే.. ఇప్పుడు 9 బైకులే ఉన్నాయి మిగిలిన ఒక‌టి ఎటు పోయింద‌ని స‌ర్ఫ‌రాజ్‌ను పోలీసులు ప్ర‌శ్నించారు. అత‌డు చెప్పిన జ‌వాబు విన్న పోలీసులు షాక్ అయ్యారు. చ‌లికాలం కావ‌డంతో త‌న‌కు బాగా చ‌లివేసింద‌ని స‌ర్ఫ‌రాజ్ చెప్పాడు. చ‌లికాచుకునేందుకు అందుబాటులో ఏమీ లేకపోవ‌డంతో ఓ బైక్ కు నిప్పంటించి చ‌లికాచుకున్నాన‌ని తెలిపాడు. దీంతో పోలీసులు ఒక్క సారిగా నివ్వ‌ర‌బోయారు. పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇది చ‌దివిన నెటిజ‌న్లు ‘ఈ మంట చాలా కాస్లీ మంట గురూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios