ఈ చర్యలతో ఇండియా థర్డ్ వేవ్‌ను జయించవచ్చు: విజయరాఘవన్
అసలే సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న వేళ భారత్‌లో థర్డ్ వేక్ అనివార్యమంటూ నిపుణులు, ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భారతదేశం కోవిడ్ థర్డ్ వేవ్‌ను సులభంగా జయించగలదని నిపుణులు చెబుతున్నారు.
అసలే సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న వేళ భారత్‌లో థర్డ్ వేక్ అనివార్యమంటూ నిపుణులు, ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భారతదేశం కోవిడ్ థర్డ్ వేవ్‌ను సులభంగా జయించగలదని నిపుణులు చెబుతున్నారు.
థర్డ్ వేవ్ తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ప్రభుత్వ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కే విజయరాఘవన్ వెనక్కి తగ్గారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఓడించలగమంటూ తాజాగా చెప్పుకొచ్చారు.
వైరస్ థర్డ్ వేవ్ ఎపుడు ఎలా వస్తుందో తెలియదు కానీ రావడం మాత్రం ఖాయమని ప్రకటించిన రెండు రోజుల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కఠిన చర్యలు తీసుకుంటే, దేశంలోని అన్ని ప్రాంతాల్లో మూడో వేవ్ రాకపోవచ్చని విజయ రాఘవన్ అభిప్రాయపడ్డారు.
Also Read:ఎప్పుడొస్తుందో.. ఎలా వస్తుందో తెలియదు, థర్డ్ వేవ్ కన్ఫర్మ్: పీఎం సలహాదారు వ్యాఖ్యలు
స్థానిక స్థాయిలో ఆయా రాష్ట్రాలలో, జిల్లాల్లో, ప్రతిచోటా ఎంత బాగా ఆంక్షలను, మార్గదర్శకాలను అమలు చేస్తారనే దానిపై కరోనా తీవ్రత ఆధారపడి ఉంటుందని విజయరాఘవన్ వెల్లడించారు.
కాగా, దేశంలో రెండో దశలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. సగం కేసులు లెక్కల్లోకి రావడం లేదని విమర్శలున్నప్పటికీ, రోజుకు 4 లక్షలకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే సమయంలో ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక, ఆక్సిజన్, మందుల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇదే బాధ అనుకుంటే తమ ఆత్మీయులను కడసారి చూసే భాగ్యానికి కూడా నోచుకోలేకపోతున్నామని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,14,188 కేసులు నమోదయ్యాయి. అలాగే 3,915 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,34,083కు చేరింది.
మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా చెప్పుకుంటున్న భారతదేశం టీకాల ఉత్పత్తి, పంపిణీకి అష్టకష్టాలు పడుతోంది. 15.7 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చామని, ప్రధాని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.