శ్రీలంకలో స్థితిగతులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీలంక పరిస్థితులపై చర్చించడానికి పిలిచి ఇలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై చర్చించడేమిటని పలు విపక్ష పార్టీల నేతలు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో.. మన దేశం కూడా అదే దారిలో పయనిస్తోందని భారత్‌లో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో పెరుగుతున్న ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ మొదటిసారి రూ. 80ని అధిగమించడం.. వంటి వాటితో ఆ భయాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో స్థితిగతులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
అయితే శ్రీలంక పరిస్థితులపై చర్చించడానికి పిలిచి ఇలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై చర్చించడేమిటని పలు విపక్ష పార్టీల నేతలు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కేంద్రం చేస్తున్న అప్పుల లెక్కలు చెప్పాలని కోరారు. అయితే ఈ సమావేశం అనంతరం మాట్లాడిన జైశంకర్.. పొరుగుదేశమైన శ్రీలంక లాంటి పరిస్థితుల్లోకి భారత్ వెళ్తుందనే భయాలు నిరాధారమైనవని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని వెల్లడించారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుస ట్వీట్స్‌తో పలు ప్రశ్నలను సంధించారు. ‘‘ఈరోజు శ్రీలంక సంక్షోభంపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పిలిచింది. అయితే భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక విషయాల గురించి సంబంధం లేని సమస్యలను లేవనెత్తడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. తన ప్రారంభ వ్యాఖ్యలలో డాక్టర్ ఎస్ జైశంకర్.. భారతదేశాన్ని శ్రీలంకతో పోల్చడం తప్పుడు సమాచారంతో కూడిన ప్రచారం అని చెప్పారు. మరి అలా అయితే DEA (ఆర్థిక వ్యవహారాల విభాగం) ఎందుకు ప్రజెంటేషన్ చేయాల్సి వచ్చింది?. చాలా ప్రతిపక్ష పార్టలు ఈ రాజకీయయూకరణను వ్యతిరేకించాయి’’ అని అసుదుద్దీన్ పేర్కొన్నారు.
అలాగే US-చైనా పోటీలో భాగంగా శ్రీలంకలో ఏమి జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం గమనించాలని కోరారు. శ్రీలంకను పావుగా మార్చడానికి మనం అనుమతించకూడదన్నారు. జాతి ఉద్రిక్తతల ప్రమాదాలను మనం విస్మరించకూడదని సూచించారు. శ్రీలంకలో మైనారిటీల నిర్లక్ష్యం ఉందని.. ముస్లింలు, తమిళులు మునుపటి ప్రభుత్వంలో భాగంగా లేరని.. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అలానే ఉంటుందన్నారు.
గోటబయ రాజ్‌పక్స భారతదేశానికి రావాలని కోరుకున్నారా..? దానిని భారత ప్రభుత్వం తిరస్కరించిందా..? అని ప్రశ్నలు సంధించారు. అదే నిజమైతే ఎందుకో సమాధానం చెప్పాలన్నారు. గోటబయ మాల్దీవులు నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు విమాన ప్రయాణాన్ని ఎన్‌ఎస్‌ఏ సులభతరం చేసిందా? అని ప్రశ్నించారు. శ్రీలంకలోని ఉత్తర మన్నార్ జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం పట్టుబట్టి ఒక భారతీయ కంపెనీకి ఇప్పించిన మాట నిజమేనా అని తాను అడిగానని చెప్పారు.
శ్రీలంక, భారతదేశం మధ్య పోలిక తప్పు సమాచారం అని జైశంకర్ చెప్పారు. గోటబయ డేటాను అణిచివేసినందున శ్రీలంకలో ఈ గందరగోళంలో ఉంది. మరి ప్రధాన మంత్రి కార్యాలయం దేశంలో ఉద్యోగ నష్టం, బాల కార్మికులపై డేటాను విడుదల చేస్తుందా?’’ అని ప్రశ్నించారు మోదీ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జరిగిన అన్యాయంపై వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలకు మద్దతుగా నిలుస్తానని చెప్పారు.
