Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడు ద్రవ్యోల్బణంతో పోరాడుతుంటే.. కేంద్రం సీబీఐ-ఈడీ గేమ్ ఆడుతోంది - కేజ్రీవాల్

దేశ ప్రజలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటి నిర్మూళనకు చర్యలు తీసుకోవడం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఓ ట్వీట్ లో విమర్శలు చేశారు. 

If common man is struggling with inflation...Centre is playing CBI-ED game - Kejriwal
Author
First Published Aug 21, 2022, 12:53 PM IST

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జరుగుతున్న విచారణపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ-ఈడీ గేమ్‌ను కొనసాగిస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు.

భారత మహిళలు ఇప్ప‌టికీ జ‌ల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తారు - రాజ‌స్థాన్ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

‘‘ సామాన్యుడు ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారు. కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై పోరాడాలి.  కానీ దానికి బదులుగా వారు (కేంద్రం) ప్రతీ ఉదయం ఈ సీబీఐ- ఈడీ ఆటను ఆడుతోంది ’’ అని ఆయన పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. సీబీఐ రైడ్ జ‌రిగిన ఒక రోజు తరువాత సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే 3-4 రోజుల్లో ఏజెన్సీ లేదా ఈడీ త‌న‌ను అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా మారుతున్న కేజ్రీవాల్ ను ఆపడానికి ఇది చేస్తున్నారని ఆయ‌న తీవ్రంగా ఆరోపించారు.

హిమాచల్ ప్ర‌దేశ్ లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. 19 మంది మృతి.. పలువురు గల్లంతు

ఇదిలా ఉండ‌గా.. మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీపై దూకుడు పెంచుతున్న సీఎం కేజ్రీవాల్.. సోమవారం నుంచి సిసోడియాతో కలిసి గుజరాత్‌లో పర్యటించనున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021 అమలుకు సంబంధించిన అవినీతి ఆరోప‌ణ‌లతో సీబీఐ త‌న ద‌ర్యాప్తును ముమ్మరం చేయడంతో ఆప్ నాయకులు బీజేపీపై దాడిని తీవ్రతరం చేశారు. 

అయితే ఈ కేసులో దాదాపు ముగ్గురు నిందితులను ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సిసోడియాతో పాటు మరో 14 మంది పేర్లు ఉన్న సీబీఐ ఎఫ్ఐఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో షేర్ చేయ‌డంతో ఆ ఏజెన్సీ మనీలాండరింగ్ ఆరోపణలను ప‌రిశీలించ‌నుంది. కాగా తాజాగా మ‌నీష్ సిసోడియాపై సీబీఐ లుక్ అవుట్ నోటీసు చేసింది. దీనిపై ఆయ‌న ట్విట్ట‌ర్ వేధికగా స్పందించారు. ఇదేం డ్రామా అంటూ  ప్రధానిపై మండిప‌డ్డారు.

గుజరాత్ లో సెల్ ఫోన్ గొడవ... కొడుకుపై కన్నతండ్రి కాల్పులు

తన ఇంట్లో జరిపిన దాడుల్లో ఒక్క పైసా కూడా లభించలేదని సిసోడియా తెలిపారు. తాను ఢిల్లీలో స్వేచ్ఛ‌గా తిరుగుతున్నాన‌ని, త‌న‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేయ‌డం ఏంట‌ని అన్నారు. ‘‘మోదీ జీ ఏంటి ఈ జిమ్మిక్కు’’ అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను ఎక్కడికి రావాలో చెప్పాలని ఆయ‌న‌ సవాల్‌ విసిరారు. కాగా.. లుక్ అవుట్ సర్క్యులర్ ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. అందులో పేర్కొన్న షరతును ఉల్లంఘించినట్లు తేలితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవ‌చ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios