తనను అరెస్ట్ చేయాలని సీబీఐని బీజేపీ ఆదేశిస్తే అరెస్ట్ చేస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
న్యూఢిల్లీ: దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పాురు. ఆదివారంనాడు ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను దేశాన్ని ,భారతమాతను ప్రేమిస్తున్నట్టుగా చెప్పారు. తాను అవినీతిపరుడినైతే ప్రపంచంలో నిజాయితీ పరుడు ఎవరూ ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఆదాయపన్ను శాఖలో కమిషనర్ గా పనిచేసినట్టుగా అరవింద్ కేజ్కీవాల్ చెప్పారు. తాను సంపాదించాలనుకుంటే వందల కోట్లు తన వద్ద ఉండేవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
also read:ఈ నెల 16న విచారణకు రావాలి:అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు
బీజేపీ తనను అరెస్ట్ చేయాలని సీబీఐని ఆదేశిస్తే .... ఆ ఆదేశాలను సీబీఐ కచ్చితంగా పాటించే అవకాశం ఉందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.సీబీఐ, ఈడీలు వంద సార్లు విచారణకు పిలిచినా కూడా తాను విచారణకు హాజరౌతానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేశ ప్రజలను బీజేపీ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్ గా ఎదగడాన్ని మీరు ఆపలేరని బీజేపీ నేతలనుద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.తనను జైలుకు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో స్కూల్స్ లో సౌకర్యాలను మెరుగుపర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో స్కూల్స్ పరిస్థితి మెరుగైందా అని ఆయన ప్రశ్నించారు.
ఆప్, అరవింద్ కేజ్రీవాల్ లు తమ పతనానికి కేంద్రంగా మారనున్నాయని బీజేపీ తెలుసునన్నారు. అందుకే తనను రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనను జైల్లో పెట్టి ఆప్ ను నాశనం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.1970 దశకంలో విపక్ష నేతలను అప్పటి ప్రభుత్వం జైల్లో పెట్టిన తరహలోనే బీజేపీ వ్యవహరిస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు.బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. తమ మటా వినని వారిని జైల్లో పెట్టాలని బీజేపీ కంకణం కట్టుకుందన్నారు.
దేశ ద్రోహులు కొందరు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని ఆయన పరోక్షంగా బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆప్ పాలన వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకు వచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ పాలన చూసి దేశ ప్రజల్లో ఒక ఆశ ఏర్పడిందని ఆయన చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ ను విచారణకు రావాలని సీబీఐ సమన్లు పంపింది. ఇవాళ సీబీఐ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావడానికి ముందు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
