ఐడియా కష్టమర్లకు మరో బంపర్ ఆఫర్

ఐడియా కష్టమర్లకు మరో  బంపర్ ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా ప్రీపెయిడ్ కష్టమర్లకు  సరికొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టింది. ఎయిర్ టెల్, జియోలతో పోటీపడేందుకు ఐడియా ఈ ఆఫర్ ని తీసుకువచ్చింది. రూ.149 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. దేశంలో ఉన్న అన్ని సర్కిల్స్‌కు చెందిన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ప్లాన్ అందుబాటులో ఉందని ఐడియా వెల్లడించింది. 

ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 21 రోజులు ఉండగా దీంట్లో వినియోగదారులకు ఎలాంటి డేటా బెనిఫిట్స్ రావు. కాకపోతే ఈ ప్లాన్ ఉన్నవారు రూ.92 ను రీచార్జి చేసుకుంటే 7 రోజుల వాలిడిటీతో 6 జీబీ డేటా వస్తుంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page